Gmail Gemini AI : ఇకపై జీమెయిల్‌లోనూ జెమిని ఏఐ టూల్.. ఈ కొత్త ఫీచర్ ఎలా వాడాలో తెలుసా?

Gmail Gemini AI : గూగుల్ డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, డ్రైవ్‌లో జెమినిని ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా జీమెయిల్ సర్వీసులో కూడా జెమిని ఏఐ ఫీచర్ తీసుసుకొచ్చింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ సాయంతో ఇమెయిల్ థ్రెడ్‌లను ఈజీగా గుర్తించవచ్చు

Gmail Gemini AI : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్ జెమిని ఇప్పుడు వెబ్‌లోని జీమెయిల్ సైడ్ ప్యానెల్‌లో అందుబాటులో ఉందని ప్రకటించింది. పవర్‌ఫుల్ జెమిని 1.5 ప్రో మోడల్‌ను ఉపయోగించే జెమిని టూల్ మరింత యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి అనేక కొత్త ఫీచర్‌లను తీసుకువస్తోంది.

గూగుల్ డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, డ్రైవ్‌లో జెమినిని ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా జీమెయిల్ సర్వీసులో కూడా జెమిని ఏఐ ఫీచర్ తీసుసుకొచ్చింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ సాయంతో ఇమెయిల్ థ్రెడ్‌లను ఈజీగా గుర్తించవచ్చు. అలా కాకుండా, జీమెయిల్‌లో జెమినీ యూజర్ల ప్రతిస్పందనలను కూడా సూచిస్తుంది. మీకు ఏం సమాధానం ఇవ్వాలి? ఎలా రిప్లయ్ ఇవ్వాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు.

కొన్ని ముఖ్య ఫీచర్లు ఇవే :
జెమిని ఇమెయిల్ థ్రెడ్‌లను గుర్తించగలదు. లాంగ్ కాన్వర్జేషన్లను సులభంగా తెలుసుకోవచ్చు. ఎలా రెస్పాండ్ కావాలో కూడా సూచిస్తుంది. ఇమెయిల్ రిప్లయ్‌లను రూపొందించడంలో యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది.

డ్రాఫ్టింగ్ అసిస్టెన్స్ : ఇమెయిల్‌ పంపడంలో అసిస్టెన్స్ అవసరమైన యూజర్లకు జెమిని సూచనలను అందిస్తుంది. వినియోగదారులకు ప్రొఫెషనల్ చక్కగా కంపోజ్ చేసిన మెసేజ్‌లనురూపొందించడంలో సాయపడుతుంది.

జీమెయిల్ యూజర్లు తమ ఇన్‌బాక్స్ లేదా గూగుల్ డిస్క్ నుంచి నిర్దిష్ట సమాచారాన్ని గుర్తించమని జెమినిని అడగవచ్చు. ఉదాహరణకు.. మీరు “నా ఏజెన్సీకి సంబంధించిన పీఓ నంబర్ ఏంటి?” అని అడగవచ్చు. లేదా “నెక్స్ట్ టీమ్ మీటింగ్ ఎప్పుడు?” జెమిని త్వరగా అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. జీమెయిల్ నుంచి నిష్క్రమించకుండానే అడిగిన ప్రశ్నలకు సమాధానాలను అందిస్తుంది.

జెమిని ఏఐ టూల్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం జీమెయిల్ మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇమెయిల్ థ్రెడ్‌లను విశ్లేషించడంతో పాటు కీలకమైన హెడ్‌లైన్స్ అందించడం వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రయాణంలో ఉన్న యూజర్లకు ఈ టూల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే స్మాల్ స్క్రీన్‌లపై లాంగ్ ఇమెయిల్ థ్రెడ్‌ల ద్వారా ఈజీగా చదువుకోవచ్చు. సందర్భానుసారంగా స్మార్ట్ రిప్లయ్, జీమెయిల్ Q&A వంటి అదనపు మొబైల్ ఫీచర్‌లు త్వరలో ప్రవేశపెట్టనుంది.

జెమిని ఏఐ ఎలా యాక్సస్ చేయాలంటే? :
జెమినిని ఎనేబుల్ చేయడానికి అడ్మిన్ కన్సోల్‌లో స్మార్ట్ ఫీచర్‌లు, పర్సనలైజేషన్ ఆన్ చేసేలా అడ్మిన్లు నిర్ధారించుకోవాలి. జీమెయిల్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న “Ask Gemini” స్టార్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా యూజర్లు జెమినిని యాక్సెస్ చేయవచ్చు. మొబైల్‌లో, ఇమెయిల్ థ్రెడ్‌లోని “summarise this email” చిప్‌పై ట్యాప్ చేయడం ద్వారా జెమినిని యాక్సెస్ చేయవచ్చు.

జీమెయిల్ వెబ్ యూజర్లకు జెమిని ఏఐ జూన్ 24, 2024 నుంచి అందుబాటులోకి వచ్చింది. రాపిడ్ రిలీజ్ డొమైన్‌ల కోసం 1 నుంచి 3 రోజులలోపు పూర్తి ఫీచర్ విజిబిలిటీ, షెడ్యూల్డ్ రిలీజ్ డొమైన్‌ల కోసం 15 రోజుల వరకు ఫుల్ ఫీచర్ విజిబిలిటీ పొందవచ్చు.

మొబైల్ యూజర్ల కోసం ర్యాపిడ్ రిలీజ్, షెడ్యూల్డ్ రిలీజ్ డొమైన్‌ల కోసం ఈ జెమిని ఏఐ ఫీచర్ రిలీజ్ అయ్యేందుకు కనీసం 15 రోజుల వరకు సమయం పడుతుంది. జెమిని నిర్దిష్ట యాడ్-ఆన్‌లతో గూగుల్ వర్క్‌స్పేస్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంది. జెమిని బిజినెస్, ఎంటర్‌ప్రైస్, జెమిని ఎడ్యూకేషన్, ఎడ్యుకేషన్ ప్రీమియం, గూగుల్ వన్ ఏఐ ప్రీమియం వంటి ఫీచర్లు ఉంటాయి.

Read Also : Gemini AI Virtual Assistant : ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘డిఫాల్ట్ వర్చువల్ అసిస్టెంట్’గా జెమిని ఏఐ మోడల్.. ఇదేలా వాడాలంటే?

ట్రెండింగ్ వార్తలు