Gemini AI Virtual Assistant : ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘డిఫాల్ట్ వర్చువల్ అసిస్టెంట్’గా జెమిని ఏఐ మోడల్.. ఇదేలా వాడాలంటే?

Gemini AI Virtual Assistant : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ జెమిని ఏఐ మోడల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్ వర్చువల్ అసిస్టెంట్ గా సెట్ చేసుకునేందుకు అనుమతిస్తుంది.

Gemini AI Virtual Assistant : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బార్డ్ చాట్‌బాట్‌ను జెమినిగా రీబ్రాండ్ చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త జెమిని యాప్‌ను కూడా ప్రారంభించింది. జెమిని యాప్ యూజర్లను ఏఐ అసిస్టెంట్‌తో చాట్ చేయడానికి అనుమతినిస్తుంది. అంతేకాదు.. యూజర్ల ఫోన్‌లో వారి డిఫాల్ట్ ఏఐ అసిస్టెంట్‌గా మార్చేందుకు అనుమతిస్తుంది. అంటే.. జెమిని యాప్ ఓపెన్ చేసి యూజర్లు ‘Ok Google’ అని చెప్పాలి లేదా వారి హోమ్ బటన్‌ను ఎక్కువసేపు నొక్కిపట్టుకోవాలి.

Read Also : Maruti Suzuki Flying Cars : మారుతీ సుజుకీ నుంచి గాల్లో ఎగిరే కార్లు..? ఈ మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లతో ట్రాఫిక్ కష్టాలు తప్పినట్టే!

అప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని అర్థం. గూగుల్ వర్క్‌స్పేస్‌లోని అన్ని డ్యూయెట్ ఏఐ ఫీచర్‌లను జెమిని బ్రాండ్‌లో ఇంటిగ్రేట్ చేసింది. అంతేకాకుండా, జెమిని అల్ట్రా 1.0కు అత్యంత అధునాతన శక్తివంతమైన ఏఐ మోడల్. ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ కొత్త గూగుల్ జెమిని యాప్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్‌లో (Google Gemini) యాప్‌ని ఎలా ఉపయోగించాలి? :
* మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లండి.
* సెర్చ్ బాక్సులో గూగుల్ జెమిని అని టైప్ చేసి యాప్‌ను కనుగొనండి.
* యాప్ ఐకాన్ పక్కన ఉన్న ఇన్‌స్టాల్ బటన్‌పై నొక్కండి.
* యాప్ డౌన్‌లోడ్ చేసి.. మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యే వరకు వేచి ఉండండి.

మీరు ఇప్పుడు జెమిని యాప్ ఫీచర్లను పొందవచ్చు. అది ఎలా ఎనేబుల్ చేయాలంటే? :
* జెమిని యాప్‌ను ఓపెన్ చేయండి.
* (Get started)పై నొక్కండి.
* జెమిని మీకు ఎలా సాయపడుతుంది అనేదానిపై సమాచారాన్ని చదవండి. ఆపై (More)పై నొక్కండి.
* ఆ తర్వాత తదుపరి స్క్రీన్‌లో ‘I agree’ ఆప్షన్ నొక్కండి.

మీరు జెమినిని మీ డిఫాల్ట్ డిజిటల్ అసిస్టెంట్‌గా మార్చాలనుకుంటే.. ఇలా ప్రయత్నించండి.

* జెమిని యాప్‌ను ఓపెన్ చేయండి.
* (Get started)పై నొక్కండి.
* జెమిని మీకు ఎలా సాయపడుతుంది అనేదానిపై సమాచారాన్ని చదవండి. ఆపై (More)పై నొక్కండి.
* ఆ తర్వాత తదుపరి స్క్రీన్‌లో ‘I agree’ ఆప్షన్ నొక్కండి.
* కంటెంట్‌ని క్రియేట్ చేయడంతో పాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం లేదా మీ ఫోన్ వినియోగాన్ని తగ్గించడం వంటి వివిధ టాస్కులపై జెమిని సాయం చేస్తుంది. హెల్ప్ కోసం జెమినిని అడగడానికి వాయిస్, టెక్స్ట్ లేదా ఫోటో ఇన్‌పుట్‌ని ఉపయోగించవచ్చు. మాట్లాడండి లేదా ఫోటోను షేర్ చేయండి అనే బాక్సులో మీ ప్రశ్నను ఎంటర్ చేయండి. మెయిల్ ఐకాన్ నొక్కండి. మీరు యాప్ టాప్ నుంచి సూచనలను కూడా ఎంచుకోవచ్చు.
* మరిన్ని ప్రశ్నల కోసం పైవిధంగా మళ్లీ రిపీట్ చేయండి.
* యాప్ మధ్యలో ఉన్న చాట్స్ విభాగంలో మీ మునుపటి ప్రశ్నలుర రెస్పాన్స్ కూడా చూడవచ్చు.

* జెమిని యాప్‌లో టాప్ రైట్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఐకాన్ నొక్కండి.
* ఆపై, (Settings)పై నొక్కండి.
* గూగుల్ నుంచి ‘Digital assistants’పై (Tap) చేయండి.
* డిఫాల్ట్ డిజిటల్ అసిస్టెంట్‌గా సెట్ చేసేందుకు (Gemini)పై నొక్కండి.
* మీరు గూగుల్ అసిస్టెంట్‌కి తిరిగి మారాలనుకుంటే.. అదే దశలను ఫాలో అవ్వండి.
* దానికి బదులుగా గూగుల్ అసిస్టెంట్‌పై మళ్లీ నొక్కండి.

గూగుల్ జెమిని యాప్‌ను దశలవారీగా రిలీజ్ చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభమైన తర్వాత గూగుల్ నెక్స్ట్ జనరేషన్ ఏఐ అసిస్టెంట్ జెమిని ఇప్పుడు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, కెనడా అంతటా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో గ్లోబల్ లాంచ్ కోసం కంపెనీ నిర్దిష్ట తేదీని వెల్లడించలేదు. అధికారిక ఛానెల్‌ల ద్వారా వినియోగదారులకు తెలియజేయనుంది. ఈ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. గూగుల్ ద్వారా కొత్త ఏఐ అసిస్టెంట్‌ని ఉపయోగించవచ్చు.

Read Also : IAS Zainab Sayeed : ఐఏఎస్ అధికారిణి జైనాబ్ సయీద్ సక్సెస్ స్టోరీ.. అత్యధిక మార్కులతో యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన ఘనత ఈమెదే!

ట్రెండింగ్ వార్తలు