Royal Enfield Bullet 350 : కొత్త బుల్లెట్ బండి కొంటున్నారా? రాయల్ బుల్లెట్ 350 సిల్వర్ వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Royal Enfield Bullet 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇప్పుడు బుల్లెట్ మిలిటరీ, బుల్లెట్ మిలిటరీ సిల్వర్, బుల్లెట్ స్టాండర్డ్, బుల్లెట్ బ్లాక్ గోల్డ్ వేరియంట్‌లను కలిగి ఉంది.

Royal Enfield Bullet 350 Price : కొత్త బుల్లెట్ బండి కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 సిల్వర్ హ్యాండ్ పెయింటెడ్ పిన్‌స్ట్రైప్‌ వేరియంట్ విడుదల చేసింది. ఈ కొత్త బుల్లెట్ బైక్.. మిలిటరీ సిల్వర్ బ్లాక్, మిలిటరీ సిల్వర్ రెడ్ వేరియంట్‌లతో చేతితో పెయింట్ చేసిన పిన్‌స్ట్రైప్‌లను సిల్వర్‌తో అందుబాటులో ఉంది.

Read Also : Asus Zenbook 14 OLED Laptop : గ్రేట్ బ్యాటరీ లైఫ్‌తో అసూస్ జెన్‌బుక్ 14 ల్యాప్‌టాప్.. అదిరిపోయే ఫీచర్లు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

ఈ బుల్లెట్ ధర రూ. 1,79,000 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్‌లు మిలిటరీ, స్టాండర్డ్ ట్రిమ్‌ల మధ్య ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇప్పుడు మొత్తం బుల్లెట్ మిలిటరీ, బుల్లెట్ మిలిటరీ సిల్వర్, బుల్లెట్ స్టాండర్డ్, బుల్లెట్ బ్లాక్ గోల్డ్ అనే 4 ట్రిమ్‌లను కలిగి ఉంది. వీటి ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

Royal Enfield Bullet 350 silver 

రాయల్ ఎన్‌ఫీల్డ్ సిల్వర్ వేరియంట్ ధరలివే :

  • బుల్లెట్ మిలిటరీ బ్లాక్ : రూ.1,73,562
  • బుల్లెట్ మిలిటరీ రెడ్ : రూ.1,73,562
  • బుల్లెట్ మిలిటరీ సిల్వర్ బ్లాక్ : రూ. 1,79,000 (కొత్తది)
  • బుల్లెట్ మిలిటరీ సిల్వర్ రెడ్ : రూ. 1,79,000 (కొత్తది)
  • బుల్లెట్ స్టాండర్డ్ మెరూన్ : రూ. 1,97,436
  • బుల్లెట్ స్టాండర్డ్ బ్లాక్ : రూ. 1,97,436
  • బుల్లెట్ బ్లాక్ గోల్డ్ : రూ.2,15,801

2023లోనే బుల్లెట్ 350 లాంచ్.. కలర్ ఆప్షన్లు ఇవే :
కొత్త మిలిటరీ సిల్వర్ బ్లాక్, మిలిటరీ సిల్వర్ రెడ్ వేరియంట్‌లు సింగిల్-ఛానల్ ఏబీఎస్ బ్యాక్ డ్రమ్ బ్రేక్‌తో వస్తాయి. ఇతర వేరియంట్లు, రంగులు అలాగే ఉంటాయి. బుల్లెట్ బ్లాక్ గోల్డ్ టాప్-ఆఫ్-ది-లైన్, మ్యాట్, గ్లోస్ బ్లాక్ ట్యాంక్, కాపర్, గోల్డ్ 3డీ బ్యాడ్జ్, కాపర్ పిన్‌స్ట్రిపింగ్, బ్లాక్-అవుట్ ఇంజిన్ కాంపోనెంట్‌ల కలయికతో ఉంటుంది.

Royal Enfield Bullet 350 

సెప్టెంబర్ 2023లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 350ని లాంచ్ చేసింది. బుల్లెట్ జే-సిరీస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మోటార్‌సైకిల్ 349సీసీ, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 20.2బీహెచ్‌పీ 27ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Read Also : Maruti Suzuki Fronx Sales : భారత్‌లో అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. అత్యంత వేగంగా లక్ష యూనిట్ల మార్క్ దాటేసింది..!

ట్రెండింగ్ వార్తలు