Samsung Galaxy AI : శాంసంగ్ యూజర్లకు పండుగే.. గెలాక్సీ ఫోన్లలో కొత్త ఏఐ ఫీచర్.. మీ ఫోన్ కాల్స్ ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు!

Samsung Galaxy AI : శాంసంగ్ కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. శాంసంగ్ ఫోన్ యూజర్లకు మెరుగైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించేందుకు అనేక AI-ఆధారిత ఫీచర్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. త్వరలో ఏఐ లైవ్ ట్రాన్స్‌లేట్ కాల్ టూల్‌ను చూస్తారని కంపెనీ ధృవీకరించింది.

Samsung Galaxy AI : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ ‘గెలాక్సీ-ఏఐ’ పేరుతో స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ కొత్త ఏఐ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇటీవలే బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. మెరుగైన స్మార్ట్‌ఫోన్ అనుభవం కోసం శాంసంగ్ తమ వినియోగదారులకు అనేక ఏఐ- ఆధారిత ఫీచర్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది.

రాబోయే అన్ని ఫీచర్లను వివరించనప్పటికీ.. త్వరలో ఏఐ లైవ్ ట్రాన్స్‌లేట్ కాల్’ టూల్ చూస్తారని కంపెనీ ధృవీకరించింది. గెలాక్సీ ఏఐ ఫీచర్ పనితీరును చక్కగా వివరిస్తుంది. ఈ ఏఐ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఫోన్ కాల్స్ సమయంలో ఆడియో, టెక్స్ట్ రియల్ టైమ్ ట్రాన్సులేషన్ అందిస్తుందని శాంసంగ్ పేర్కొంది.

Read Also : Samsung Galaxy A05s Launch : శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ భయ్యా.. ఫీచర్ల కోసమైన ఈ గెలాక్సీ A05s ఫోన్ కొనేసుకోండి..!

థర్డ్ పార్టీ యాప్స్‌తో పనిలేదు :
ఈ ఫీచర్ మీ డేటాతో పాటు ప్రైవసీ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని కంపెనీ చెబుతోంది. శాంసంగ్ లోకల్ ఫోన్ యాప్‌లో ఈ ఫీచర్ విలీనం చేయనుంది. ఏఐ లైవ్ ట్రాన్స్‌లేట్ కాల్ ఫీచర్.. త్వరలో లేటెస్ట్ గెలాక్సీ ఏఐ ఫోన్‌ని కలిగిన వినియోగదారులకు పర్సనల్ ట్రాన్సులేటర్‌గా అందిస్తుంది. లోకల్ కాల్ ఫీచర్‌లో విలీనం చేయడం ద్వారా థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆడియో, టెక్స్ట్ ట్రాన్సులేషన్ రియల్‌టైమ్‌లోనే కనిపిస్తాయి. మీరు మాట్లాడే సమయం, మరో భాషలో మాట్లాడే వారికి అర్థమయ్యేలా చెబుతుందని శాంసంగ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Samsung AI features for Galaxy phones 

2024లో ఏఐ పవర్ ఫీచర్లతో గెలాక్సీ ఫోన్ :

వచ్చే ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఏఐ ఫీచర్లతో ఫోన్ ప్రవేశపెట్టనుంది. ఏఐ ఫీచర్‌‌తో రానున్న శాంసంగ్ కొత్త ఫోన్ పేరును కంపెనీ పేర్కొనలేదు. అయితే, రాబోయే గెలాక్సీ ఎస్24 లైనప్‌తో రావచ్చని టైమ్‌లైన్ సూచిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఇప్పటివరకు జనవరి 2024 ప్రారంభంలో రానుందని సూచించింది. జనరేటివ్ ఏఐ మోడల్ ఇటీవలి శాంసంగ్ గాస్ (Gauss) ఈవెంట్లో రాబోయే డివైజ్‌లలో ఏఐ ఫీచర్‌లను రూపొందించడంలో ముఖ్యమైన పాత్రను సూచిస్తుంది.

పిక్సెల్ 8, ఆపిల్ ఐఫోన్లలోనూ ఏఐ ఫీచర్లు :

ఏఐ-పవర్‌ ఫీచర్ల ట్రెండ్‌కు తగినట్టుగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రాబోయే ఫోన్లలో అత్యాధునిక టెక్నాలజీని అందిస్తున్నాయి. శాంసంగ్, గూగుల్ కొత్త పిక్సెల్ 8 లైనప్ మెరుగైన ఫొటో ఎడిటింగ్ అనుభవం కోసం ఏఐ టూల్స్ అందించనుంది. రికార్డ్ చేసిన వీడియోలలో నాయిస్ తగ్గించడానికి ఆడియో మ్యాజిక్ ఎరేజర్ టూల్ వంటి ఉపయోగకరమైన ఫీచర్‌లను అందించింది.

కొత్త ఏఐ-ఆధారిత ఫీచర్ కూడా ఉంది. లీక్‌లను విశ్వసిస్తే.. ఏఐ ట్రైనింగ్‌లో ఆపిల్ గణనీయమైన పెట్టుబడి పెట్టగా.. త్వరలో ఐఫోన్లలో ఏఐ పవర్డ్ ఫీచర్‌లను కూడా చూస్తామని సూచిస్తుంది. 2024 ప్రారంభంలో శాంసంగ్ ఫోన్‌లలో రియల్-టైమ్ కాల్ ట్రాన్సులేషన్, ఇతర ఏఐ ఫీచర్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇతర పోటీదారుల కన్నా శాంసంగ్ ఏఐ టెక్నాలజీ కొంచెం మెరుగ్గా ఉండవచ్చు.

Read Also : Xiaomi Redmi 13C Launch : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. షావోమీ రెడ్‌మి 13C ఫోన్ ఇదిగో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు