కమల్, విజయ్ లైవ్ చాట్ చూశారా!

తమిళ స్టార్స్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి లైవ్ చిట్ చాట్..

  • Publish Date - May 5, 2020 / 11:55 AM IST

తమిళ స్టార్స్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి లైవ్ చిట్ చాట్..

కోలీవుడ్ : ఉలగనాయగన్ కమల్ హాసన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇన్‌స్టాగ్రామ్ వీడియో చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా వీరిద్దరు సినిమాలు, రాజకీయాలతోపాటుగా పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే విజయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు కమల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను కూడా వెల్లడించారు.దాదాపు 90 నిమిషాల పాటు వీరి మధ్య చర్చ జరిగింది.

ఈ సందర్భంగా విజయ్‌ నటనపై కమల్‌ ప్రశంసలు కురిపించారు. ‘నటుడిగా నేను నిన్ను చాలా ఇష్టపడతాను. కమర్షియల్‌ హంగుల వైపు వెళ్లకుండా మీరు స్క్రిప్టును నమ్ముకుంటారు. సక్సెస్‌ ఎప్పుడైనా వస్తుంది.. కానీ స్క్రిప్టును నమ్ముకుని మీరు చేసే ప్రయాణం​ ఎప్పటికీ వృథా కాదు’ అని  పేర్కొన్నారు.ఈ క్రమంలో.. నటించే ప్రతి పాత్రకు సంబంధించి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారని కమల్‌ను విజయ్‌ ప్రశ్నించారు.

దీనిపై కమల్‌ స్పందిస్తూ.. ‘నాకు నా గురువు,దర్శకుడు కె బాలచందర్‌, మలయాళం సినిమా నటన గురించి నేర్పించాయి. మలయాళం ప్రజలు తమ అభిమాన నటులను విభిన్న పాత్రల్లో ప్రయోగం చేయడాన్ని ఇష్టపడతారు. కానీ తమిళనాడులో నటులను కొన్ని రకాల పాత్రల్లో చూడటానికి మాత్రమే ఇష్టపడతారు. చాలా కాలం తర్వాత నటనలో ప్రయోగాలు చేయాలనే కోరిక నీలో చూస్తున్నాను’ అని కమల్‌ చెప్పారు. అలాగే దిగ్గజ నటుడు, దివంగత సీఎం ఎంజీఆర్‌తో చెప్పిన కొన్ని మాటలను గుర్తుచేశారు. ఆయన అడుగు జాడల్లో నడవొద్దని ఎంజీఆర్‌ తనను కోరినట్టు కమల్‌ చెప్పారు. ఎంజీఆర్‌, శివాజీ గణేశన్, దిలీప్‌ కుమార్‌ లాంటివారు భవిష్యత్తు తరం కోసం మంచి వేదికను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు కమల్. వీరి లైవ్ చాట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read |  శ్రీముఖిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

ట్రెండింగ్ వార్తలు