Petrol Diesel Prices : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు రెండో రోజు పెరిగాయి. దేశవ్యాప్తంగా 30 పైసలు చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెరిగింది.

Petrol Diesel Prices Hike : వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు రెండో రోజు పెరిగాయి. దేశవ్యాప్తంగా 30 పైసలు చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 18 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55 కి చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర రూ. 80.91కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16 లకు చేరింది. డీజిల్ ధర రూ.88.25 లకు చేరింది. కరీంనగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.31గా ఉంది. డీజిల్ ధర రూ.88.39 లకు చేరింది. మెదక్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.84కు చేరగా డీజిల్ ధర రూ.88.89 లకు చేరింది. నల్లగొండలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.68, లీటర్ డీజిల్ ధర రూ.88.72, రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16, లీటర్ డీజిల్ రూ.88.25, వరంగల్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 93.75, లీటర్ డీజిల్ ధర రూ.87.95గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.46కు చేరింది. డీజిల్ ధర రూ.90.4 లకు చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.73 ఉండగా, లీటర్ డీజిల్ రూ.89.31లకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు