SRH vs MI : వాంఖడే స్టేడియంలో జూనియర్ బుమ్రా సందడి.. ఫోటోలు వైరల్.. స్పెషల్ ఏమిటో తెలుసా?
ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా కుటుంబ సభ్యులు స్టేడియంకు వచ్చారు. బుమ్రా సతీమణి సంజనా గణేశన్ కుమారుడు అంగద్ ను ..
- Harish Thanniru
- Updated on- May 7, 2024 / 08:26 AM IST
Jasprit Bumrah
jasprit bumrah Son Angad in Stands : ఐపీఎల్ 2024 లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు టీమిండియా ఫాస్ట్ బౌలర్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా కుటుంబ సభ్యులు స్టేడియంకు వచ్చారు. బుమ్రా సతీమణి సంజనా గణేశన్ కుమారుడు అంగద్ ను ఒడిలో కూర్చొబెట్టుకొని మ్యాచ్ ను వీక్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : IPL 2024 : టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు శుభవార్త
మరోవైపు సోమవారం బుమ్రా సతీమణి సంజనా గణేశన్ పుట్టిన రోజు. ఆమె 1991 మే6న పూణెలో జన్మించారు. జస్ర్పీత్ బుమ్రా కూడా తన భార్యకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలాఉంటే బుమ్రా, సంజనా 2021 మార్చిలో వివాహం చేసుకున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తరువాత 2023 సెప్టెంబర్ నెలలో వారికి కుమారుడు జన్మించాడు.
Also Read : IPL 2024 : సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం
