IPL 2024 : సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం

MI vs SRH IPL 2024 Match : ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్; 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్)తో సెంచరీతో అజేయంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

IPL 2024 : సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం

Mumbai Indians vs Sunrisers Hyderabad ( Image Credit : @IPL_Twitter/Google )

MI vs SRH IPL 2024 Match : ఐపీఎల్ 2024లో ముంబై అదరగొట్టింది. సొంతగడ్డ వాంఖడే స్టేడియం వేదికగా సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. దాంతో ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సన్‌‌రైజర్స్ నిర్దేశించిన 174 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 17.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులతో గెలిచింది.

ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్; 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్)తో సెంచరీతో అజేయంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా ఆటగాళ్లలో తిలక్ వర్మ (37)తో రాణించగా, ఇషాన్ కిషాన్ (9), రోహిత్ శర్మ (4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, కెప్టెన్ పాట్ కమిన్స్ తలో వికెట్ తీసుకున్నారు. వన్ మ్యాన్ షోతో అదరగొట్టిన సూర్యకుమార్ (102/51)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ట్రావిస్ హెడ్‌దే టాప్ స్కోరు :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది. దాంతో ప్రత్యర్థి జట్టు ముంబైకి 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. హైదరాబాద్ ఆటగాళ్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48)పరుగులతో టాప్ స్కోరరుగా నిలిచాడు.

మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ (35 నాటౌట్)గా రాణించగా, నితీష్ కుమార్ రెడ్డి (20), అభిషేక్ శర్మ (11), షాబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17), మయాంక్ అగర్వాల్ (5), హెన్రిచ్ క్లాసెస్ (2), అబ్దుల్ సమద్ (3), సన్వీర్ సింగ్ (8 నాటౌట్) పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా తలో 3 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 4లో హైదరాబాద్ :
పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 5 ఓడి 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 ఓడి మొత్తం 8 పాయింట్లతో అట్టడుగునా 9వ స్థానంలో ఉండిపోయింది.

Read Also : Wasim Akram : విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేటు పై పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు వ‌సీం అక్ర‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు