SuryaKumar Yadav
SuryaKumar Yadav : వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్తంగా అతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్ -2024 టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడుతుంది. ఇప్పటికే బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడనుంది. అయితే, ప్రస్తుతం భారత్ వేదికగా ఐపీఎల్ -2024లో మ్యాచ్ లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ మంచి ఫామ్ ను కొనసాగిస్తూ సెంచరీ చేశాడు. దీంతో సదరు బ్యాటర్ టీ20 వరల్డ్ కప్ కు ముందు ఫాంలోకి రావడం టీమిండియా ఫ్యాన్స్ కు పెద్ద శుభవార్తే.
Also Read : IPL 2024 : సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం
టీ20 ప్రపంచ కప్ కు వెళ్లే భారత్ జట్టులో టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్, ప్రపంచ నెం.1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. ఈ సీజన్ లో సూర్య అద్భుత ఫామ్ తో వేగంగా పరుగులు చేస్తున్నాడు. సూర్య ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ సీజన్ లో ముంబై జట్టు పేలవ ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలు కోల్పోయినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సూర్య సెంచరీ చేశాడు. కేవలం 51 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్ కప్ కు మరికొద్దిరోజులే సమయం ఉన్న నేపథ్యంలో సూర్య ఫాంలోకి రావడంతో భారత్ జట్టుకు కలిసొచ్చే అంశంగా మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు భావిస్తున్నారు.
Also Read : Ravindra Jadeja : జడేజా మామూలోడు కాదుగా..! ధోనినే వెనక్కి నెట్టాడు..
సూర్యకుమార్ యాదవ్ తో పాటు టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడే భారత్ జట్టులోని ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మలు కూడా ఈ ఐపీఎల్ లో సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. వీరితోపాటు మరికొందరు ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇదే ఫాం ను టీ20 వరల్డ్ కప్ లో కొనసాగిస్తే పరుగుల వరద పారడం ఖాయమని క్రీడాభిమానులు భావిస్తున్నారు.
THE BEST T20 BATTER…!!!!!
– THE ERA OF SURYAKUMAR YADAV IN T20. ?? pic.twitter.com/PJhaifcAJo
— Johns. (@CricCrazyJohns) May 6, 2024