Arya 20 Years : 20 ఏళ్ళ ‘ఆర్య’ రీ యూనియన్ స్పెషల్ పార్టీ.. బన్నీ, సుకుమార్, దిల్ రాజుతో సహా మూవీ యూనిట్ అంతా..

7 మే 2004లో ఆర్య సినిమా రిలీజయింది. నేటికి ఈ సినిమా పూర్తయి 20 ఏళ్ళు కావొస్తుంది.

Arya 20 Years : అల్లు అర్జున్(Allu Arjun) రెండో సినిమాగా సుకుమార్(Sukumar) డెబ్యూట్ దర్శకత్వలో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో వచ్చిన సినిమా ఆర్య. అప్పటివరకు వచ్చిన లవ్ స్టోరిలకు డిఫరెంట్ గా, ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో, ఫీల్ గుడ్ పాటలతో ఆర్య సినిమా రావడంతో ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆర్య సినిమాని భారీ హిట్ చేసేసారు ఆడియన్స్. కేవలం 4 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా 30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు.

అల్లు అర్జున్ హీరోగా, అను మెహతా హీరోయిన్ గా, శివ బాలాజీ, రాజన్ దేవ్, సునీల్, వేణు మాధవ్.. పలువురు ముఖ్య పాత్రలతో ఆర్య సినిమా తెరకెక్కినది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతంతో లైఫ్ టైం గుర్తుండిపోయే పాటలు ఇచ్చాడు. ఇప్పటికి ఫీల్ మై లవ్ అంటూ ఆర్య సాంగ్స్ పాడుకుంటూనే ఉంటాము. ఆర్య సినిమాకు నాలుగు నంది అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయి. 7 మే 2004లో ఆర్య సినిమా రిలీజయింది. నేటికి ఈ సినిమా పూర్తయి 20 ఏళ్ళు కావొస్తుంది. దీంతో సుకుమార్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తయింది.

Also Read : Sukumar : 20 ఏళ్ళ సుక్కు మాస్టర్.. క్లాసిక్ ‘ఆర్య’ నుంచి మాసివ్ ‘పుష్ప 2’ వరకు..

లవ్ సినిమాల్లో క్లాసిక్ గా నిలిచిన ఆర్య 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో మూవీ యూనిట్ రీ యూనియన్ ప్లాన్ చేసి స్పెషల్ పార్టీ చేయబోతున్నారు. నేడు హైదరాబాద్ లో ఆర్య మూవీ టీం, మీడియా, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆర్య 20 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజుతో పాటు ఆర్య సినిమాకి పనిచేసిన వాళ్ళు ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆర్య 20 ఏళ్ళ స్పెషల్ పోస్టులు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు