Sukumar : 20 ఏళ్ళ సుక్కు మాస్టర్.. క్లాసిక్ ‘ఆర్య’ నుంచి మాసివ్ ‘పుష్ప 2’ వరకు..

2004 మే 7న ఆర్య సినిమాతో లెక్కల మాస్టర్ సినీ పరిశ్రమలోకి వచ్చి అప్పట్నుంచి ఎలాంటి లెక్కలు వేసుకోకుండా సినిమాతోనే తన జీవితం అంటూ ఆయన ప్రయాణిస్తూ తనతో చాలామందిని ముందుకు తీసుకెళ్తూ నేటితో 20 ఏళ్ళ ప్రయాణం కొనసాగించారు.

Sukumar : 20 ఏళ్ళ సుక్కు మాస్టర్.. క్లాసిక్ ‘ఆర్య’ నుంచి మాసివ్ ‘పుష్ప 2’ వరకు..

Director Sukumar Completed 20 Years Journey in Fim Industry From Arya Movie

Sukumar : సుకుమార్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. క్యూట్ లవ్ స్టోరీలతో లవ్ లో పడేలా చేయగలరు. లాజిక్ సినిమాలతో వావ్ అనిపించగలరు. మాస్ కమర్షియల్ సినిమాలతో అదరగొట్టేసాడు అనిపించగలరు. లెక్కలు, ఫిజిక్స్ చెప్తూ మాస్టర్ లా ఎంతోమంది స్టూడెంట్స్ ని లైన్లో పెట్టిన సుక్కు మాస్టర్ డైరెక్టర్ గా మారి ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు.

2004లో ‘ఆర్య’ సినిమాతో అల్లు అర్జున్ ని కొత్తగా పరిచయం చేసి జనాలకు ఒక కొత్త ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూపించి ఫీల్ మై లవ్ అనేలా చేసాడు. యూత్ అంతా సుకుమార్ లవ్ స్టోరీకి ఫిదా అయిపోయారు, ఆర్యతో అల్లు అర్జున్ స్టార్ అయిపోయాడు. ‘జగడం’ కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా ఆ టేకింగ్ కి రాజమౌళి సైతం ఆశ్చర్యపోయి అభినందించారు. ఎంతోమంది యూత్ కి జగడం లో రామ్ క్యారెక్టర్ నచ్చింది. ‘ఆర్య 2’ అంటూ మరో కొత్త లవ్ స్టోరీని ఫీల్ అయ్యేలా చేసాడు. ఇక ‘100 % లవ్’ అంటూ ప్రేక్షకులకు తన వంద శాతం ప్రేమను ఇచ్చాడు. ‘1 నేనొక్కడ్నే’ అంటూ సరికొత్త ప్రయోగం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు సుక్కు మాస్టర్.

‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఎన్టీఆర్ కి ఒక సరికొత్త లుక్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడమే కాక తన లాజిక్స్ తో సినిమాని అదరగొట్టేసారు. ప్రతి కొడుకు నాన్నకు ప్రేమతో అని పాడేలా చేసారు. సుకుమార్ లవ్ స్టోరిలకు ఫేమస్ అని అంతా అనుకునే టైంలో రాజమౌళి ఓ సారి.. సుకుమార్ లవ్ స్టోరీలు చేస్తున్నాడు కాబట్టి మేమంతా ఇక్కడ ఉన్నాం. సుకుమార్ మాస్ సినిమాలు మొదలుపెడితే అంతే సంగతులు అన్నారు. ఆయన మాటల్ని నిజం చేస్తూ ‘రంగస్థలం’ సినిమాతో ఒక్కసారిగా తనలోని మాస్ విశ్వరూపం చూపించారు. రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా రంగస్థలం నిలిచిపోయింది. చిరంజీవి సైతం ఆ సినిమాని పొగిడారు.

Director Sukumar Completed 20 Years Journey in Fim Industry From Arya Movie

సుకుమార్ ఇక మాస్ మొదలు పెట్టాడు ఇంకెలా వస్తాడో అనుకునేలోపే ‘పుష్ప’ సంభవం చూపించారు. పుష్ప అంటూ పాన్ ఇండియా మొత్తం తగ్గేదేలే అనిపించారు. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ చేసారు సుకుమార్. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో సాధించలేని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ సాధించారంటే ఆయనతో ఆ రేంజ్ లో సుకుమార్ యాక్టింగ్ చేయించారు. త్వరలో పుష్ప 2 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఇప్పటికే లవ్ స్టోరీల్లో సరికొత్తవి చూపించేసారు. ఇక మాస్ కమర్షియాలిటీలో అందర్నీ మించిపోయారు. మరి రాబోయే రామ్ చరణ్ సినిమాతో ఇంకే రేంజ్ లో కొత్త కథని చూపించి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

Also Read : Anupama Parameswaran : ‘లాక్ డౌన్’లో అనుపమ పరమేశ్వరన్.. ఫుల్ ఫామ్‌లో ఉందిగా అనుపమ..

మొదటి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకున్న సుకుమార్ ఆయన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకుల మనస్సులో అభిమానం సంపాదించుకున్నారు. స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైనా ఆయన అంటే ఎందుకు అందరికి స్పెషల్ అంటే తను సినిమాలు తీయడం మాత్రమే కాదు ట్యాలెంట్, ప్యాషన్, కష్టపడే తత్త్వం ఉన్న చాలా మందికి సపోర్ట్ చేయడానికి నిర్మాతగా మారారు. సుకుమార్ రైటింగ్స్ అంటూ కొత్త సినిమాలకు, దర్శకులకు సపోర్ట్ చేస్తున్నారు.

Director Sukumar Completed 20 Years Journey in Fim Industry From Arya Movie

ఇక సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చాలా మంది ఇప్పుడు దర్శకులుగా మారి హిట్స్ కొడుతున్నారు. తన శిష్యుల సినిమా ప్రమోషన్స్ కి వచ్చి మరీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందుకే సుక్కు మాస్టర్ చాలా స్పెషల్. 2004 మే 7న ఆర్య సినిమాతో లెక్కల మాస్టర్ సినీ పరిశ్రమలోకి వచ్చి అప్పట్నుంచి ఎలాంటి లెక్కలు వేసుకోకుండా సినిమాతోనే తన జీవితం అంటూ ఆయన ప్రయాణిస్తూ తనతో చాలామందిని ముందుకు తీసుకెళ్తూ నేటితో 20 ఏళ్ళ ప్రయాణం కొనసాగించారు. ఇది ఇంకా ముందుకెళ్తూ మరిన్ని సినిమాలతో ఇంకా ఎన్నో సంవత్సరాలు మనల్ని ఎంటర్టైన్ చేయాలి డైరెక్టర్ సుకుమార్.