నేనే దగ్గరుండి కూలగొడతా- ఫామ్‌హౌస్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

అక్కడ చాలామంది కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయని తెలిపారు కేటీఆర్.

Ktr On Janwada Farm House : జన్వాడలో తనకు ఫామ్ హౌస్ ఉందంటూ వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తన పేరు మీద ఎక్కడా ఫామ్ హౌస్ లేదన్నారాయన. జన్వాడలో తెలిసిన మిత్రుడి ఫామ్ హౌస్ ను లీజ్ కు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ చెప్పారు. అది బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి మరీ కూలగొట్టిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. అక్కడ చాలామంది కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయని తెలిపారు కేటీఆర్.

Also Read : మహిళా కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ నేత..! చిచ్చు రాజేసిన వేణుస్వామి వ్యవహారం..!

ట్రెండింగ్ వార్తలు