రూ.3.63 కోట్లతో ఎగ్ పఫ్‌లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు: పేర్ని నాని

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలు బయటపెట్టాలని, జీఏడీ చంద్రబాబు చేతిలో..

జగన్ సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ ఏపీలోని తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజల బాగోగులు వదిలేసి జగన్ పై అబాంఢాలు వేస్తున్నారని చెప్పారు. రూ.3.63 కోట్లతో ఎగ్ పఫ్‌లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడి కూటమి చేతిలో ఉందని, జీఏడీ డిపార్ట్మెంట్ పేరు పెట్టి ఆ పోస్టులు పెట్టించాలని పేర్ని నాని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలు బయటపెట్టాలని, జీఏడీ చంద్రబాబు చేతిలో ఉందిగా అని చెప్పారు. జగన్ గవర్నమెంట్లో అలాంటి తప్పుడు పనులు చేయలేదని, చంద్రబాబు హయాంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలను పట్టుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించారని, ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని అన్నారు.

టమాటా రైతులను దత్తత తీసుకుంటానని నారా లోకేశ్ పాదయాత్రలో చెప్పారని, ఇప్పుడు ఆ రైతులు బాధ పడుతుంటే
మరి ఆయన ఏం చేస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఇంకోలా మాట్లాడటం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్నా టమాటా రైతులను ఎందుకి దత్తత తీసుకోలేదని నిలదీశారు. వైసీపి వారి‌మీద దాడి చేయటం కాదని, జనానికి ఉపయోగపడే పనులు చేయాలని అన్నారు.

Also Read: ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం.. ఇప్పటికీ తమ విధానం విశాఖ పరిపాలన రాజధానేనని కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు