Rains In Telangana: తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ వాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. వచ్చే మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని, ద్రోణి బలహీనపడిందని తెలిపారు.

ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించిన కేంద్ర సర్కారు

ట్రెండింగ్ వార్తలు