చంద్రబాబుకి ఊరట.. ఆళ్ల రామకృష్ణ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేవేసి సుప్రీంకోర్టు

రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ రామకృష్ణ రెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం హెచ్చరించింది.

సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని, అలాగే, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ రామకృష్ణ రెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణ రెడ్డి పిటిషన్‌ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కాగా, ఓటుకు నోటు కేసు 2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన విషయం తెలిసిందే.

తెలంగాణలో 2015 ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు టీడీపీ లంచం ఇచ్చినట్లు మీడియాలో ప్రసారమైన వీడియో ఫుటేజీ కలకలం రేపింది. ఈ కేసులోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని ఆళ్ల రామకృష్ణ రెడ్డి ముందు హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. రెండు కోర్టుల్లోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎదురుదెబ్బే తగిలింది.

Also Read: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పిటిషన్.. అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కౌంటర్ పిటిషన్

ట్రెండింగ్ వార్తలు