ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం.. ఇప్పటికీ తమ విధానం విశాఖ పరిపాలన రాజధానేనని కామెంట్స్

తే తాము కూర్చొని విధానాలపై మళ్లీ చర్చిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

Botsa Satyanarayana

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణతో మండలి చైర్మన్ మోషేనురాజు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం బొత్స సత్యారాయణ మాట్లాడుతూ.. తమ జిల్లాలోని పెద్దలు అందరూ వచ్చి తనకు మద్దతు తెలిపారని అన్నారు.

తనకు అవకాశం ఇవ్వడం పట్ల తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌కి ధన్యవాదాలు చెబుతున్నానని బొత్స సత్యనారాయణ తెలిపారు. తమ పార్టీ వారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అన్నారు. జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు తనను ఏకగ్రీవంగా రాజకీయాలకు అతీతంగా ఎన్నుకున్నారని తెలిపారు.

ఇప్పటికీ తమ విధానం విశాఖ పరిపాలన రాజధానేనని, అవసరమైతే తాము కూర్చొని విధానాలపై మళ్లీ చర్చిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ మారడం, చేరడం మన ఒక్క రాష్ట్రంలోనే జరుగుతోందా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో దౌర్జన్యం, దమనకాండకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని బొత్స సత్యనారాయణ చెప్పారు. కేసులు అధికారులపై పెడుతున్నారా? ఎవరి మీద పెడుతున్నారు? అనే విషయాలు ముఖ్యం కాదని తెలిపారు. తప్పు చేసినట్టు నిరూపణ అయితే శిక్షించాలని, శిక్షించవద్దని తాము అనలేదని వ్యాఖ్యానించారు.

Also Read: రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, వెంటాడతాం: కేటీఆర్ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు