విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పిటిషన్.. అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కౌంటర్ పిటిషన్

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు..

YS Jagan

హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరపగా.. 20 రోజులపాటు కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

లండన్‌లో జగన్ కూతురురి చూడటానికి వెళ్లాలని అన్నారు. ఈ ఏడాదిలో విదేశీ పర్యటనకు జగన్ అనుమతి కోరడం ఇది రెండోసారి. ఏపీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత 15 రోజులు పాటు జగన్ విదేశాలకు వెళ్లారు. మరోసారి విదేశాలకు వెళ్లేందుకు జగన్ అనుమతి ఇవ్వద్దని సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని కోరారు. ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పును ఈనెల 27న వెల్లడిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది. మరోవైపు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన పిటిషన్‌పై ఈ నెల 30న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించునుంది.

Also Read: రూ.3.63 కోట్లతో ఎగ్ పఫ్‌లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు: పేర్ని నాని

ట్రెండింగ్ వార్తలు