అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు

అమాయక ప్రజలపై ప్రయోగిస్తున్న అస్త్రం హైడ్రా అని అన్నారు.

Kamareddy MLA Venkataramana Reddy

ప్రభుత్వం మారగానే తమకు అనుకూల అధికారులను పెట్టుకుని అధికారం ఇచ్చిన ప్రజలను నేతలు ఇబ్బందులు పెడుతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వెంకట రమణారెడ్డి మాట్లాడారు. చాలామంది ప్రజలకు శిఖం భూములు, బఫర్ జోన్స్ వంటి తెలియవని తెలిపారు.

ప్రజలు ఈసీలు ఉన్నాయా? బ్యాంకు లోన్లు వస్తాయా? అన్న విషయాలే చూస్తారని వెంకట రమణారెడ్డి చెప్పారు. ప్రజల ఎంతో కష్టపడి జీవితం మొత్తం సంపాదించిన డబ్బులతో భూములు కొంటే వారిని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్స్ ఉంటాయని వాటిని ప్రజలు చూసుకోవాలని అన్నారు.

అక్రమ కట్టడాలు కూల్చడం, చెరువులను కబ్జాలను కాపడం మంచిదేనని వెంకట రమణారెడ్డి తెలిపారు. కానీ, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులమీద చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం రాజకీయ నాయకులా లేదా అధికారులా అని నిలదీశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో ఎలాంటి తప్పు లేదని అయితే, అక్కడ రోడ్డు వేసిన వారిది తప్పా లేదా పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ ది తప్పా అని నిలదీశారు.

కరెంటు బిల్లు వసూలు చేసిన వారిది తప్పా లేదా అనుమతులు ఇచ్చిన అధికారులది తప్పా అని వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. అధికారులు అందరూ కలిసి ప్రజలను తప్పు అని చూపిస్తున్నారని తెలిపారు. అధికారులు ఇచ్చిన అనుమతుల మీదనే కట్టడలు జరుగుతుంటే ఆ అధికారుల మీద యాక్షన్ ఏది అని నిలదీశారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఇళ్లు కొనాలి అంటే ప్రజలు భయపడే పరిస్థితి తెచ్చారని చెప్పారు. అమాయక ప్రజలపై ప్రయోగిస్తున్న అస్త్రం హైడ్రా అని అన్నారు.

Also Read: నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్..! రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక

ట్రెండింగ్ వార్తలు