ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ పార్టీ బెయిల్ ఇప్పిస్తోంది.. అందుకే ఇలా చేశారు: బండి సంజయ్

ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు.

Bandi Sanjay

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ పార్టీనే బెయిల్ ఇప్పిస్తోందని చెప్పారు. ఆమె బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీయే కోర్టులో వాదిస్తున్నారని తెలిపారు.

అందుకే సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పినోళ్లకే రాష్ట్రంలో మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇస్తున్నారని అన్నారు. బీజేపీకి, కవిత బెయిల్‌కు సంబంధమే లేదని చెప్పారు.

సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాగా, కవితకు త్వరలోనే బెయిల్ వస్తుందని ఇటీవల కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిపిందని, అందుకే కవితకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్‌ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఢిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: పోలవరం ప్రాజెక్ట్ ఫైల్స్ దహనంపై కేంద్ర సహాయమంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు