పోలవరం ప్రాజెక్ట్ ఫైల్స్ దహనంపై కేంద్ర సహాయమంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు
దీని వెనుక ఏం జరిగింది అనే దానిపై సీఎం చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టి పెట్టారు.

Polavaram Project Files Burnt : పోలవరం ప్రాజెక్ట్ ఫైల్స్ దగ్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ప్రాజెక్ట్ దస్త్రాలు తగలబడిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్రం కూడా సీరియస్ గా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. కచ్చితంగా ప్రాజెక్ట్ దస్త్రాల దహనం ఘటన వెనుకున్న కథను వెలికితీసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు భూపతిరాజు శ్రీనివాస వర్మ. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
”పోలవరం ప్రాజెక్ట్ దస్త్రాల దహనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం సైతం చాలా సీరియస్ గా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. దీని వెనుక ఏం జరిగింది అనే దానిపై సీఎం చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టి పెట్టారు. కచ్చితంగా ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయి. తగలబడిన దస్త్రాల వెనుక ఉన్న కథ ఏంటన్న విషయాన్ని బయటకు లాగుతాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఒక నెల లేటుగా జీతాలు ఇస్తున్నారు. ఇది ఆ మధ్య కాలం నుండి జరుగుతూనే ఉంది. స్టీల్‌ప్లాంట్ ఉన్నత అధికారులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు సినిమా పాటలకు డ్యాన్స్ చేశారనేది నా దృష్టికి రాలేదు. ఆ వీడియో పరిశీలించి దానిపై చర్యలు తీసుకుంటాం” అని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు చెప్పారు.
Also Read : ఆ ఐపీఎస్‌లకు సెలవులు ఇస్తారా? డీజీపీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి