Shocking Video : షాకింగ్ వీడియో.. పేరెంట్స్ బీ కేర్‌ఫుల్, పిల్లాడు చేసిన పనికి స్కూటీ పైనుంచి ఎగిరిపడ్డ తండ్రి

ఓ వ్యక్తి తన ఇంటి ముందు స్కూటీని ఆన్ లో ఉంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ స్కూటీపై ముందు భాగంలో అతడి కొడుకు నిల్చుని ఉన్నాడు. తండ్రి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా.. కొడుకు యాక్సిలరేటర్ పట్టుకుని ఉన్నాడు. అలా పట్టుకున్న వాడు ఊరుకుండక.. యాక్సిలరేటర్ ను రైజ్ చేశాడు.(Shocking Video)

Shocking Video : ఈ ఘటన తల్లిదండ్రులకు, పెద్దలకు ఓ హెచ్చరిక లాంటిది. పిల్లలను బైక్ మీద ఎక్కించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఇన్సిడెంట్ ఇది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మహారాష్ట్రలో జరిగిన ఓ షాకింగ్ ఘటనే ఇందుకు నిదర్శనం.

మహారాష్ట్రలోని సింధు దుర్గ్ లో ఓ వ్యక్తి తన ఇంటి ముందు స్కూటీని ఆన్ లో ఉంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ స్కూటీపై ముందు భాగంలో అతడి కొడుకు నిల్చుని ఉన్నాడు. తండ్రి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా.. కొడుకు యాక్సిలరేటర్ పట్టుకుని ఉన్నాడు. అలా పట్టుకున్న వాడు ఊరుకుండక.. యాక్సిలరేటర్ ను రైజ్ చేశాడు.

Also Read..Video Of Naked Foreigner : బాబోయ్.. దుస్తులు విప్పేసి పచ్చి బూతులు తిడుతూ సిబ్బందిపై దాడి.. ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళ రచ్చ రచ్చ

అంతే, ఒక్కసారిగా స్కూటీ ముందుగా కదిలింది. దీంతో స్కూటీ అదుపు తప్పింది. బాలుడు కిందపడిపోగా, స్కూటీపై ఉన్న వ్యక్తి వెనక్కి ఎగిరిపడ్డాడు. ఇది చూసిన అతడి బంధువులు పరుగున బయటకు వచ్చారు. ఏం జరిగిందోనని కంగారుపడ్డారు. బండి పైనుంచి పడ్డ తండ్రికి గాయాలయ్యాయి. కింద పడ్డ వ్యక్తి పైకి లేవలేకపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు బాబుని ఎత్తుకున్నారు. బండిని పైకి లేపారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Also Read..Kukatpally Bike Accident : షాకింగ్ వీడియో.. ప్రాణం తీసిన అతివేగం, హైదరాబాద్ కూకట్‌పల్లిలో బైకర్ స్పాట్ డెడ్

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన చూసి అంతా వామ్మో అంటున్నారు. అయితే ఆ పిల్లాడు కావాలని ఇలా చేయలేదు. ఏదో సరదాగా చేశాడు. అందులో ఆ బాలుడి తప్పేమీ లేదు. యాక్సిలరేటర్ రైజ్ చేయడం వల్ల ప్రమాదం జరుగుతుందని అస్సలు ఊహించలేదు.(Shocking Video)

కాగా, పిల్లలు బండిపై ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బండి ఆపిన సమయంలో కచ్చితంగా ఇంజిన్ స్విచ్చాఫ్ చేయాలని సూచిస్తున్నారు. లేదంటే, ఇదిగో ఇలాంటి ప్రమాదాలు జరిగే చాన్స్ ఉందని హెచ్చరించారు.

 

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు