AP Covid Latest News : ఏపీలో కరోనా.. 2,870 శాంపిల్స్ పరీక్షించగా..

రాష్ట్రంలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. 24 గంటల వ్యవధిలో 2వేల 870 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం..

AP Covid Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 2వేల 870 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో మరణించిన వారి సంఖ్య 14వేల 730. రాష్ట్రంలో నేటివరకు 3,35,14,144 కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 3,030 కరోనా టెస్టులు చేయగా.. నాలుగు పాజిటివ్ కేసులు వచ్చాయి.

Delhi Covid : ఢిల్లీలో కరోనా భయం.. మళ్లీ నిబంధనలు

అటు దేశంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు స్వల్ప స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వెయ్యికి సమీపంలో కేసులొస్తున్నాయి. తాజా వ్యాప్తితో యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

శుక్రవారం 4.5 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 527 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్క ఢిల్లీలోనే 1,042 మందికి కోవిడ్ సోకింది. దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి చేరింది. నిన్న మరో 33 మంది కొవిడ్ తో మరణించారు. కేరళలో నమోదైన మృతుల సంఖ్య 31 కాగా, ఢిల్లీలో ఇద్దరు మరణించారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5.22 లక్షల మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.

ఇవాళ కూడా కొత్త కేసుల కంటే రికవరీలే తక్కువగా ఉన్నాయి. నిన్న 1,656 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 15వేలు దాటాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 15,079కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.04 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.75 శాతానికి తగ్గింది. నిన్న 19.13 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

India Covid-19 : దేశంలో కొవిడ్ నాల్గో వేవ్ ముప్పు.. వరుసగా 4వరోజు పెరిగిన కరోనా కేసులు

కొన్నిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు వెయ్యికి పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వారం ఆర్‌-వాల్యూ (రీ-ప్రొడక్షన్‌ నంబర్‌) 2.1 దాటింది. కొవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్‌ వ్యాల్యూ ద్వారా అంచనా వేస్తారు. దీని విలువ ఒకటిగా ఉంటే.. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకుతుంది. ఒకటి దాటిందంటే మాత్రం డేంజర్ బెల్స్ మోగినట్లే. కానీ ఢిల్లీలో ఈ విలువ ఇప్పుడు 2.1కి చేరుకుంది. భారత్‌ వ్యాప్తంగా 1.3గా ఉంది. ఢిల్లీలో ఆర్‌ వ్యాల్యూ రెండు కంటే ఎక్కువగా ఉంది అంటే.. వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి మరో ఇద్దరికి సోకుతుందని నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు