Chandrababu : చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.. కొన్ని తీర్పులు రిజర్వ్, మరికొన్ని వాయిదా.. ఏం జరగనుంది?

చంద్రబాబుకి ఊరట లభిస్తుందా? బెయిల్ వస్తుందా? కస్టడీకి ఇస్తారా? ఇదంతా కూడా క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే ఆధారపడుంది.

Chandrababu Cases

Chandrababu Cases : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు.. టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలు కేసులపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది. కొన్ని కేసుల్లో తీర్పు రిజర్వ్ చేసి ఉన్నాయి. మరికొన్ని కేసుల్లో విచారణ వాయిదా పడింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పుని రేపు(సెప్టెంబర్ 22) ఇవ్వబోతోంది ఏసీబీ న్యాయస్థానం.

హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఇవి కాకుండా చంద్రబాబుపై మరో కస్టడీ పిటిషన్ వేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో చంద్రబాబు ఏ-1గా ఉన్నారని సీఐడీ పేర్కొంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది.

కస్టడీ పిటిషన్ ఒకవైపు, బెయిల్ పిటిషన్ మరోవైపు.. మొత్తంగా చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు సీఐడీ, మరోవైపు చంద్రబాబు న్యాయవాదులు హోరాహోరీగా తలపడే పరిస్థితి ఉంది. ఈరోజు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో కచ్చితంగా తుది తీర్పు వస్తుందని అంతా ఆశించారు. కానీ, తీర్పు రేపటికి వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం హైకోర్టులో చంద్రబాబుకి సంబంధించిన క్వాష్ పిటిషన్ పై తీర్పు పెండింగ్ లో ఉండటమే. ఇదిలా ఉంటే చంద్రబాబుకి సంబంధించి మరో కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టు ముందుకు వచ్చింది.

Also Read..TDP Strategy: టీడీపీ ముందున్న ఏకైక మార్గం అదేనా.. వారిద్దరినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తారా?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని, ఇందులో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, తనకు కావాల్సిన వ్యక్తులకు లబ్ది జరిగే చేసే విధంగా చంద్రబాబు వ్యహరించారని, ఇందులో చంద్రబాబు ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాలని, 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో కోరింది సీఐడీ. దీనికి సంబంధించిన విచారణ రేపు (సెప్టెంబర్ 22) ఏసీబీ కోర్టులో వాదనకు వచ్చే అవకాశం ఉంది. అటు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన తీర్పు ఇవాళ(సెప్టెంబర్ 21) 4గంటలకు రావాల్సి ఉండగా, రేపు ఉదయానికి వాయిదా పడింది. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తుది ఆదేశాలను బట్టి కస్టడీ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

ఈలోపలే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో మరో కస్టడీ పిటిషన్ వేయడంతో మొత్తం రెండు కస్టడీ పిటిషన్లు ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కస్టడీకి సంబంధించిన పిటిషన్ పై విచారించాల్సి ఉంది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో కస్టడీ పిటిషన్ పైన తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అంగళ్లు ఘర్షణకి కేసుకి సంబంధించి ఏ-1 నిందితుడిగా చంద్రబాబు ఉన్నారు.

రాజకీయ కక్షతో అక్కడ చంద్రబాబు అల్లర్లు సృష్టించారని, ఆ సమయంలో పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయని, దీనికి ప్రధాన నిందితుడు చంద్రబాబు అని, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు కూడా ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది.

Also Read..Nara Lokesh : చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్

మొత్తంగా బెయిల్ పై ఒకవైపు, కస్టడీ పిటిషన్ పై మరోవైపు వాదనలు జరుగుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం క్వాష్ పిటిషన్ పై తుది తీర్పు వస్తే.. వీటన్నింటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ కు సంబంధించి రేపు (సెప్టెంబర్ 22) హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఆ తీర్పుకి అనుగుణంగా కస్టడీకి ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? అనేది తేలనుంది. మరో రెండు రోజుల్లో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తయ్యే సమయం దగ్గర పడుతోంది. ఇవాళ్టితో(సెప్టెంబర్ 21) 12 రోజుల రిమాండ్ పూర్తయింది.

మరో రెండు రోజుల్లో రిమాండ్ పూర్తి కావాల్సిన ఈ సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును కస్టడీకి అనుమతి ఇస్తారా? లేదా? అన్నది క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీసుకునే నిర్ణయంపై పూర్తిగా ఆధారపడే అవకాశం ఉంది. చివరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. సర్వత్రా తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడింది. ఈ కేసులో చంద్రబాబుకి ఊరట లభిస్తుందా? బెయిల్ వస్తుందా? కస్టడీకి ఇస్తారా? ఇదంతా కూడా రేపు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంది.

Also Read..Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

 

ట్రెండింగ్ వార్తలు