CM Jagan : వారందరికి కొత్త ఇళ్లు.. సీఎం జగన్ శుభవార్త

భారీ వర్షాలు, వరదలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు.

CM Jagan : భారీ వర్షాలు, వరదలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు చిగురుటాకులా వణికాయి. ఇంకా చాలా ఊళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

వరదల కారణంగా అన్నీ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన వరద బాధితులకు సీఎం జగన్‌ ఊరటనిచ్చే వార్త చెప్పారు. వరదల వల్ల ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్నవారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలని… వచ్చే 3,4 రోజుల్లో పరిహారం అందాలని జగన్ ఆదేశించారు.

Belly Fat : బాన బొజ్జ ప్రమాదకరమా? పరిష్కారం ఏంటంటే..

”పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలి. వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు మంజూరు చేయాలి. పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎన్యుమరేషన్‌ చురుగ్గా సాగాలి. రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి కలెక్టర్లు వెంటనే నివేదికలు ఇవ్వాలి. నెల రోజుల్లోగా శాశ్వత పనులు మంజూరు కావాలి. చెరువులు, గట్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు వెంటనే మొదలుకావాలి. రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వాలి. 13 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భద్రతపై దృష్టి పెట్టాలి. డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలు బయటకు తీయాలి. అన్నమయ్య ప్రాజెక్టు లాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కూడదు” అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఈ నెల 26 నుంచి మరోసారి అతి భారీ వర్షాలు పడే అవకాశముందిన వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాగ్రత్త వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలి సూచించారు.

Smartphones: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లు

ఏపీలో వరద పరిస్థితులు, సహాయక చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఇస్తున్న సాయం పూర్తిగా బాధితులకు అందాలని అధికారులను ఆదేశించారు జగన్. సాయం అందించడంలో ఎక్కడా తప్పులు జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు