Tirupati : పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. అడ్డంగా దొరికిపోయిన స్మగ్లర్లు

Tirupati : ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పైన భాగంలో కూరగాయలు ఉంచారు. ఇప్పుడు దొరికిన ముఠా చాలా పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లుగా..

Tirupati – Ganja Smuggling : తిరుపతిలో పుష్ప సినిమా తరహాలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట క్రాస్ దగ్గర బొలెరో ట్రక్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అది కూరగాయల లోడ్ తో వెళ్తోంది. అయినా, పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. అంతే.. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

వాహనంలో చెక్ చేయగా పోలీసులే షాక్ అయ్యారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పైన భాగంలో కూరగాయలు ఉంచారు. కింద భాగంలో గంజాయి ఉంచడాన్ని గమనించారు.. సుమారు 48లక్షల విలువైన 240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. 8మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పారిపోయారు. ముఠా సభ్యుల నుంచి 5 సెల్ ఫోన్లు, బొలెరో ట్రక్, ఇన్నోవా వాహనాన్ని కూడా సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ లో పట్టుబడ్డ వాళ్లంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు పోలీసులు.(Tirupati)

Also Read..Hayat Nagar: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. ఖాకీ సినిమా తరహాలో ఘటన

పుష్ప సినిమాలో గుట్టు చప్పుడు కాకుండా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే విధానం చూపించారు. పైన ఒకటి ఉంచి కింద ఎర్రచందనం దుంగలు పెట్టి అక్రమ రవాణ చేయడం అందులో ఉంది. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు గంజాయిని కొత్త కొత్త పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. కాయగూరల మాటున యధేచ్చగా గంజాయి అక్రమ రవాణ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు స్మగ్లర్లు. ఈ మొత్తం రాకెట్ అనకాపల్లి టు శ్రీలంక వయా సుళ్లూరుపేట వరకు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సుళ్లూరుపేట మీదుగా ఈ గంజాయి అంతా చెన్నైకి వెళ్తోంది. చెన్నై హార్బర్ నుంచి పడవల్లో శ్రీలంకకు గంజాయి రవాణ చేస్తున్నారు.

గంజాయి అక్రమ రవాణ గురించి పోలీసులకు రహస్య సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు సూళ్లూరుపేట క్రాస్ దగ్గర మాటు వేశారు. సూళ్లూరుపేట బోర్డర్. అది దాటేస్తే తమిళనాడులోకి వెళ్లిపోతారు. కరెక్ట్ గా సూళ్లూరుపేట క్రాస్ దగ్గర బొలెరో వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీలు చేశారు. దాంతో గంజాయి అక్రమ రవాణ వ్యవహారం బట్టబయలైంది. 240 కిలోల గంజాయిని 120 ప్యాకెట్లలో ఉంచారు. దీని విలువ సుమారుగా 50లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఇద్దరు పోలీసులను చూడగానే పారిపోయారు.(Tirupati)

Also Read..Vizianagaram : కూతురిని హీరోయిన్ చేయాలని, ఆ భాగాలు త్వరగా పెరగాలని హార్మోన్ ఇంజెక్షన్లు.. కసాయి తల్లి అరెస్ట్

చాలా ఏళ్లుగా ఈ దందా నడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశాఖ నుంచి ఈ రూట్ లో గంజాయి అక్రమ రవాణ జరుగుతోందన్నారు. తిరుపతి వస్తుంది. అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తుంది. అయితే, హార్బర్ కి వెళ్లాలి అన్నప్పుడు వయా సూళ్లూరుపేట మీదుగా చెన్నై హార్బర్ కు గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు దొరికిన ముఠా చాలా పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గంజాయి విశాఖపట్నం అరకు నుంచి వస్తుంది. విజయవాడ మీదుగా నెల్లూరు, సూళ్లూరుపేట వస్తుంది. వైజాగ్ నుంచి అందిన పక్కా సమాచారంతోనే తిరుపతి పోలీసులు ఈ రాకెట్ ను పట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు