Andhra Pradesh : కరెంట్ కోతలు తప్పవ్..ఎంత తక్కువ వాడితే అంత మంచిది : మంత్రి సజ్జల

ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు తెలియకుండా కొందరు హైకోర్టులో కేసు వేయించారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.

Andhra Pradesh : ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు తెలియకుండా కొందరు హైకోర్టులో కేసు వేయించారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇళ్ల స్థలాల విషయంలో రాజకీయ శక్తులు తెరవెనక ఉండి పన్నాగంతో దుష్టక్రిడకు తెరతీశాయని మండిపడ్డారు. ప్రభుత్వం 31 లక్షల మంది పేదలకు గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుందని.. కానీ కోర్టు తీర్పు దానికి శరాఘాతంగా మారిందన్నారు.

Read More : Power Cut: కోత మొదలైంది.. కొందామన్నా కరెంట్ దొరకట్లే!

గతంలో ఉన్నట్లు అసైన్డ్ పట్టా కాకుండా ఒనర్ షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో 17వేల చోట్ల ఊర్లు నిర్మిస్తున్నామని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇప్పటికే 10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అఫిడవిట్లు వేయించి టీడీపీ ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటుందని తెలిపారు. ఇక ఇళ్ల నిర్మాణాలు ఆపాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కి వెళ్తామని తెలిపారు. అక్కడ ప్రభుత్వానికి న్యాయం జరుగుతుందని వివరించారు. కోర్టు తిర్పులు తాత్కాలిక అడ్డంకులని తెలిపారు.ఇదే సమయంలో ఇంటిస్థలం గురించి ప్రస్తావించారు. పేదలకు 340 చదరపు అడుగుల స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నాం అని తెలిపారు. ఎన్ బీటీ ప్రకారం 221.9 ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

Read More : Power Cuts : పండగపూట అంధకారంలోకి భారతదేశం ?

ఇక ఇదే సమయంలో విద్యుత్ కొరతపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా దేశీయంగా బొగ్గు లభ్యత లేకపోవడం, రేటు పెరగడం వల్ల సమస్య వచ్చిందని వివరించాడుల ప్రస్తుతం డబ్బు పెట్టినా బొగ్గు దొరకడం లేదని తెలిపారు. ఇళ్లలో వినియోగాన్ని తగ్గించుకోవాలని విజ్ణప్తి చేశారు. ప్రజలు రాత్రి 6-8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి సూచించారు.

Read More : Delhi Power Crisis : రెండు రోజుల్లో చీక‌ట్లు.. దేశ రాజధానిలో తీవ్ర విద్యుత్ సంక్షోభం

విద్యుత్ విషయంలో కేంద్ర మంత్రి చెప్పిన అంశంలో వాస్తవం లేదని..ఆయన చెప్పిన అంశాలను ఖండిస్తున్నాం అన్నారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం తగ్గించాలని అవగాహన చర్యలు చేపడతామని తెలిపారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు అమలు చేయాల్సి రావచ్చని తెలిపారు సజ్జల. సీఎం జగన్ ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారని. గుర్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు