పిన్నెల్లి వీడియోపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు

మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందన్నారు. నేతలు పరామర్శలకు వెళితే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని చెప్పారు.

CEO Mukesh Kumar Meena : ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కు హైదరాబాద్ లో టీమ్ పని చేస్తోందని ఆయన తెలిపారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలు పిన్నెల్లి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పిన్నెల్లి వీడియో ఎన్నికల కమిషన్ నుంచి విడుదల కాలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మాచర్లలో గాయపడిన నాయకులను పరామర్శించొద్దని సూచించామన్నారు. మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందన్నారు. నేతలు పరామర్శలకు వెళితే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని చెప్పారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యవహారంలో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామనే విషయాన్ని సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. పిన్నెల్లి కోసం హైదరాబాద్ లో ఒక టీమ్ గాలిస్తోంది. హైదరాబాద్ లో పిన్నెల్లి ఎక్కడున్నా అరెస్ట్ చేస్తారని, అందుకు సంబంధించి సోదాలు చేస్తున్న విషయాన్ని సీఈవో తెలిపారు. ఇక వీడియో లీకేజీ వ్యవహారం మీద పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. దీనిపై సీఈవో మీనా స్పందించారు. ఆ వీడియోను ఎన్నికల కమిషన్ విడుదల చేయలేదని ఆయన తేల్చి చెప్పారు.

వీడియోను విచారణ అధికారులకు ఇచ్చిన సమయంలో ఎక్కడో, ఎవరి చేతిలో నుంచో ఆ వీడియో లీక్ అయ్యి ఉండొచ్చు తప్ప.. వీడియో లీకేజీకి, ఎన్నికల కమిషన్ కు ఎలాంటి సంబంధం లేదని సీఈవో మీనా మరోసారి స్పష్టం చేశారు. అయితే, పిన్నెల్ల విషయంలో సెక్షన్లు కఠినంగా ఉన్నాయని, ఆయనకు శిక్ష తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఈవో మీనా. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారని తేల్చి చెప్పారు.

Also Read : ఘోర పరాజయం తప్పదు..! చిచ్చు రాజేసిన పీకే వ్యాఖ్యలు, భగ్గుమంటున్న వైసీపీ నాయకులు

ట్రెండింగ్ వార్తలు