Adani LIC Shares : అదానీ గ్రూప్ ఎఫెక్ట్.. ఎల్ఐసీ పరిస్థితి ఏంటి? ప్రమాదంలో కోట్లాది మంది బీమా సొమ్ము

అదానీ గ్రూప్ షేర్లలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ఎల్ ఐసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం కుదేలయ్యే పరిస్థితి రావడంతో ఎల్ ఐసీ కూడా తన వంతు నష్టాలను మూటకట్టుకోక తప్పదనిపిస్తోంది.

Adani LIC Shares : అదానీ గ్రూప్ దెబ్బతో కుదేలైన ఇండియన్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది. మార్కెట్లు మళ్లీ పుంజుకుంటాయా? లేక హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రకంపనలు ఇతర సంస్థలకు పాకుతాయా? మార్కెట్ల పతనం ఇంతటితో ఆగుతుందా? సోమవారం మరో బ్లాక్ మండే అవుతుందా? అసలేం జరగనుంది? అన్నది ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అదానీ గ్రూప్ దెబ్బకు భారత స్టాక్ మార్కెట్లు విలవిలలాడిపోతున్నాయి. హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రకంపనలతో రెండు రోజుల్లోనే స్టాక్ మార్కెట్లు ఏకంగా 11లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. సుబ్బు పెళ్లి వెంకి చావుకి వచ్చిందన్నట్లు అదానీ గ్రూప్ లకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల షేర్లు ఇప్పటికే భారీగా పతనం కాగా పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన మొదలైంది.

Also Read..Hindenburg Report-ADANI Group: అదానీకి ఐదు సవాళ్లు.. అందరి ఆశలు జనవరి 30పైనే..

అదానీ గ్రూప్ షేర్లలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ఎల్ ఐసీ పరిస్థితి అయితే అగమ్యగోచరంగా మారింది. ఇటీవలి కాలంలో ఆకాశమే హద్దుగా అదానీ గ్రూప్ కంపెనీలు మార్కెట్ లో చెలరేగిపోయాయి. వాటి షేర్ల ధరలు కూడా దినదిన ప్రవర్త మానంగా వెలిగిపోయాయి. అప్పటికే అనేక బ్యాంకులు వేలాది కోట్ల రూపాయల రుణాలు ఇవ్వగా నేను సైతం అంటూ ఎల్ఐసీ ముందుకొచ్చింది. వెనకా ముందు చూడకుండా వేలాది కోట్ల రూపాయలు అదానీ గ్రూప్ షేర్లలో కుమ్మరించింది. దేశంలో ఒకే కంపెనీ ఉన్నట్లుగా ఎల్ ఐసీ సొమ్మును తీసుకెళ్లి అదానీ కంపెనీల్లో కుమ్మరించింది. తీరా ఇప్పుడు హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం కుదేలయ్యే పరిస్థితి రావడంతో ఎల్ ఐసీ కూడా తన వంతు నష్టాలను మూటకట్టుకోక తప్పదనిపిస్తోంది.

Also Read..ADANI ..Hindenburg Report : అదానీ గ్రూప్ కంపెనీల పునాదుల్ని షేక్ చేసిన ‘ఒక్క రిపోర్ట్’‌.. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్ చెప్పిందేంటి..?

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ ఐసీకి దేశవ్యాప్తంగా 25కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. పాలసీదారుల నుంచి ప్రీమియంగా వసూలు చేసిన సొమ్ములో భారీ మొత్తం అదానీ షేర్లలో కరిగిపోయింది. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడులు రెండు రోజుల్లోనే 18వేల కోట్లకు పైగా తరిగిపోయాయి.

అదానీ గ్రూప్ కంపెనీల్లో ఈ నెల 24 నాటికి ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 81వేల 268 కోట్లు. అదానీ గ్రూప్ షేర్లు పతనం కావడంతో శుక్రవారం నాటికి అవి 61వేల 621 కోట్లకు పడిపోయాయి. అదానీ కంపెనీల్లో దేశంలో ఏ బీమా సంస్థ చేయనంత భారీగా ఎల్ ఐసీ పెట్టుబడి పెట్టింది. వాస్తవానికి ఆ గ్రూప్ కంపెనీలో ప్రమోటర్ గౌతమ్ అదానీ తర్వాత పెద్ద ఇన్వెస్టర్ ఎల్ ఐసీనే. దేశంలోని టాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏ ఒక్కదానికి అదానీ కంపెనీల్లో ఒక్కశాతం వాటా మించి లేదు. కానీ, ఎల్ ఐసీకి 5 అదానీ కంపెనీల్లో ఒక శాతానికి పైగా వాటా ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అదానీ ఎంటర్ ప్రైజస్ లో గౌతమ్ అదానీ తర్వాత అతిపెద్ద ఇన్వెస్టర్ ఎల్ఐసీయే. అదానీ ఎంటర్ ప్రైజెస్ తాజాగా జారీ చేసిన 20వేల కోట్ల ఎఫ్ పీవో పరిమాణంలో 5శాతం షేర్లకు ఎల్ఐసీ బిడ్ వేసింది. ఆ షేర్లను ఇప్పటికే ఎల్ఐసీకి కేటాయించారు కూడా. ఎఫ్ పీవో యాంకర్ ఇష్యూలో ఒక్కో షేర్ ను 3వేల 276 చొప్పున ఎల్ ఐసీ 300 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ షేర్ విలువ శుక్రవారానికల్లా 2వేల 700 రూపాయలకు మార్కెట్ లో దొరుకుతుంది. ఈ ఒక్కో ట్రేడింగ్ తో ఎల్ఐసీ కొత్త పెట్టుబడి 300 కోట్ల నుంచి 250 కోట్లకు తరిగిపోయింది.

ట్రెండింగ్ వార్తలు