Chip Cheatign in Petrol bunks : పెట్రోలు బంకుల్లో ‘చిప్స్’చీటింగ్..లీటరుకు 50 ML దోపిడీ..బంక్ యజమానులతో కలిసి దందా

పెట్రోలు బంకుల్లో ‘చిప్స్’ దందాలతో ప్రజల్ని దోచుకుంటున్నారు కేటుగాళ్లు. లీటరు పెట్రోలుకు 30 నుంచి 50 ఎంఎల్ తక్కువ పోసేలా ‘చిప్’ సెట్ చేసి వినియోగదారుల్ని అడ్డంగా దోచేస్తున్నారు.

Chip Cheatign in Petrol bunks: ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతు వాహనదారులకు చమురు కంపెనీలు చుక్కలు చూపిస్తుంటే..మరోవైపు పెట్రోలు బంకుల్లో ‘చిప్స్’ దందాలతో మరింతగా ప్రజల్ని దోచుకుంటున్నారు కేటుగాళ్లు. లీటరు పెట్రోలుకు 30 నుంచి 50 ఎంఎల్ తక్కువ పోసేలా సెట్ చేసి వినియోగదారుల్ని అడ్డంగా దోచేస్తున్నారు. ఇవన్నీ బంకు యజమానులకు తెలియవా? అంటే అదేం లేదు. సాక్షాత్తు బంకు యజమానులతో కలిసే ఈ దందాలకు పాల్పడుతుండటం గమనించాల్సిన విషయం. ఈరోజుల్లో దాదాపు ప్రతీ వ్యక్తి పనిమీద బయటకు వెళ్లాలంటేచిన్నదో పెద్దదో ఏదోక వాహనం ఉండాల్సిందే. లేదంటే పనులు కావు. వాహనం ఉందీ అంటే పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకోవాల్సిందే. అలా బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుంటే జేబులకే కాదు బ్యాంకు బ్యాలెన్స్ లు కూడా కరిగిపోతున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న చమురు ధరలతో. ఈ దోపిడీ చాలదన్నట్లుగా కొందరు పెట్రోల్‌‌‌‌ బంకుల ఓనర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. మైక్రో చిప్స్​తో కస్టమర్లను మోసం చేస్తున్నారు.

మైక్రో చిప్స్​తో కస్టమర్లను మోసం చేస్తున్నారు. వినియోగదారులు బంకులకు వెళ్లి పెట్రోల్ గానీ డీజిల్ గాని పోయించుకుంటే లీటరుకు 30 నుంచి 50 ఎంఎల్ తక్కువగా పోసేలాగా ‘చిప్’లు అమర్చుతు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ చిప్ అమర్చినా..మీటర్​లో మనకు కరెక్ట్​గానే పెట్రోల్​ పోసినట్టు కనిపిస్తుంది. కానీ, లీటర్‌‌‌‌ పెట్రోల్‌‌‌‌ కొట్టిస్తే.. 30 ఎంఎల్‌‌‌‌ నుంచి 50 ఎంఎల్‌‌‌‌ వరకు ఓనర్లు గాయబ్​ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్నాటకలో పెట్రోల్‌‌‌‌ దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్​ను పోలీసులు పట్టుకున్నారు.గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్ తో సహా తెలంగాణాలోని 34 బంకుల్లో చిప్స్‌‌‌‌ ఫిక్స్‌‌‌‌ చేసిన 8 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్‌‌‌‌ ఎస్‌‌‌‌వోటీ పోలీసులు గురువారం అరెస్ట్‌‌‌‌ చేశారు. నిందితుల నుంచి మైక్రో చిప్స్, మదర్‌‌‌‌‌‌‌‌ బోర్డ్స్‌‌‌‌, డిజిటల్‌‌‌‌ మీటర్స్‌‌‌‌, రిమోట్స్‌‌‌‌ సహా 64 రకాల ఎలక్ట్రానిక్ డివైజ్​లను స్వాధీనం చేసుకున్నారు. పోయినేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 13 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్‌‌‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు నాలుగు పెట్రోల్‌ బంక్‌లలో పనిచేసే మేనేజర్లను కూడా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

Read more : AP : పెట్రోల్ పోయించుకుంటున్నారా ? గమనించండి..మోసపోకండి

గతంలోను ఇదే దందా..జైలుకుపోయొచ్చి అదే దందా..
పోలీసులు అరెస్టు చేసిన గ్యాంగ్​లో మేడ్చల్‌‌‌‌ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన 46 ఏళ్ల మహ్మద్‌‌‌‌ ఫైజల్చఅల్వాల్‌‌‌‌కు చెందిన 38 ఏళ్ల కురదె సందీప్, చంద్రయాణ్‌‌‌‌ గుట్ట బండ్లగూడకు చెందిన 29 ఏళ్ల మహ్మద్ అస్లం, యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజు పల్లికి చెందిన 32 ఏళ్ల నర్శింగరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 64 ఎలక్ట్రానిక్ డివైజ్ లను స్వాధీనం చేసుకున్నారు. వీరు బంకు యజమానులతో కలిసి లక్ష రూపాల నుంచి రూ.2లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకుని ఇలా దందాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

నిందితుల్లో మహ్మద్‌‌‌‌ ఫైజల్ బారి, కురదె సందీప్, మహ్మద్ అస్లం, నాగేశ్వరరావు గతంలో పెట్రోల్ బంక్‌‌‌‌ల్లో పనిచేశారు. వీళ్లు ఫిల్లింగ్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో ట్యాంపరింగ్‌‌‌‌పై టెక్నిక్‌‌‌‌ నేర్చుకున్నారు. గుజరాత్​లోని సూరత్‌‌‌‌కి చెందిన జయేష్‌‌‌‌ వద్ద మైక్రో చిప్స్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసి.. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలోని బంకుల్లో ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేసేవారు. ఒక్కో చిప్ ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌ కోసం వీళ్లు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బంకు యజమానుల దగ్గర వసూలు చేసేవారు. ఈ క్రమంలో 2014లో కూకట్‌‌‌‌పల్లి పోలీసులకు చిక్కారు. జైలు నుంచి రిలీజ్‌‌‌‌ అయ్యాక మళ్లీ చిప్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాలేషన్ ప్రారంభించారు. మీడియేటర్స్‌‌‌‌ ద్వారా గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ తో సహా తెలంగాణలోని కామారెడ్డి, ఖమ్మం, వనపర్తి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, సూర్యాపేట, సిద్దిపేటతో పాటు ఏపీ, కర్నాటకలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌ చిప్స్‌‌‌‌ ఫిక్స్‌‌‌‌ చేశారు.

Read more : Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

చిప్స్ తో ట్యాంపరింగ్​ ఎలాగంటే..
పెట్రోల్‌‌‌‌ పిల్లింగ్‌‌‌‌ బాక్స్‌‌‌‌ మీటర్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ వెనుక భాగంలోని మదర్‌‌‌‌‌‌‌‌బోర్ట్‌‌‌‌లో మైక్రో చిప్​ను ఫిక్స్​ చేస్తారు. దీనికి డిస్​ప్లే బోర్డ్‌‌‌‌లోని డిజిటల్‌‌‌‌ నంబర్స్‌‌‌‌ రీడింగ్​కు కనెక్ట్ చేస్తారు. కరెక్ట్‌‌‌‌ రీడింగ్‌‌‌‌ చూపిస్తూ తక్కువ పెట్రోల్‌‌‌‌ డెలివరీ అయ్యే విధంగా ఈ మైక్రో చిప్​ వర్క్​ చేస్తుంది. ప్రతి బంకులో సుమారు నాలుగు ఫిల్లింగ్ మిషన్లుంటే.. రెండు ఫిల్లింగ్‌‌‌‌ మిషన్లను ఇట్ల ట్యాంపర్​ చేస్తారు. కాగా..పెట్రోల్‌ బంకుల్లో మోసాలు జరుగుతున్నట్టు వాహనదారులకు అనుమానం వస్తే వెంటనే పోలీసులను, తూనికలు కొలతలశాఖ అధికారులను సంప్రదించాలని డీసీపీ పద్మజ తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈజీగా మనీ సంపాదన కోసం చిప్ దందా..
కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించటానకి ఇలా అడ్డదారులు తొక్కుతు అసలు పెట్రోలు,డీజిల్ భారాలతో సతమతమయ్యే వినియోదారులనుంచి మరింతగా దోచేస్తున్నారు ఈ కేటుగాళ్లు. బంకుల్లో చిప్ లు అమర్చి లీటర్‌కు 30ML, 50ML తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేసి.. కస్టమర్లకు తక్కువగా వచ్చేలా చేస్తున్నారు. బంక్ ఓనర్స్. మైక్రో చిప్ లు అమర్చి మన కళ్ల ముందే మనకు తెలియకుండా పెట్రోల్ ను కొట్టేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో మోసాలు బయటపడటంతో సామాన్యులు మండిపడుతున్నారు. ఓవైపు పెట్రో ధరలతో కుదేలవుతుంటే.. ఇలాంటి మోసాలు తమను మరింత ఇబ్బంది పెడుతున్నాయని వాపోతున్నారు. మరోసారి ఇలాంటి ఛీటింగ్ చేయకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు