తెలంగాణలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం

Rains in Telangana: కాప్రా, మల్కాజిగిరి, ఈసీఐఎల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్ , పీర్జాదిగూడ పరిసర ప్రాంతాల్లో

Rain

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో వర్షం దంచి కొట్టింది. ఎల్బీనగర్ కూకట్పల్లి సర్కిళ్ల పరిధిలో వర్షం కురిసింది. తుర్కయంజాల్ , మన్నెగూడా, ఆదిభట్ల, బొంగులూరులో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

అంబర్ పేట్, కాచిగూడ, నారాయణగూడ, రాంనగర్, ముషీరాబాద్, దోమలగూడ, నారాయణ గూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాచారం, మల్లాపూర్ లో రోడ్లపై నిలిచింది వర్షపు నీరు. వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్ల, ఎస్ఈలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అధికారులను అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశించారు.

కాప్రా, మల్కాజిగిరి, ఈసీఐఎల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్ , పీర్జాదిగూడ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలోని సూరారం, జీడిమెట్ల, షాపూర్ నగర్, సుచిత్ర సెంటర్, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్ లోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట మండలం చిన్న నిజాంపేట గ్రామంలో గొర్రెల మందపై పిడుగు పడి 12 గొర్రెలు మృతి చెందాయి. సుమారు లక్షన్నర ఆస్తి నష్టం జరిగింది.

వివేకా హత్య కేసుపై హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో విచారణ

ట్రెండింగ్ వార్తలు