వివేకా హత్య కేసుపై హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో విచారణ

YS Viveka Case: ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్ పేజీలు జిరాక్స్ కాపీలు కావాలని కోరిన నిందితుల తరుఫు న్యాయవాది కోరారు.

వివేకా హత్య కేసుపై హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో విచారణ

YS Vivekananda Reddy (File Photo)

మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కోర్టుకు భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. అలాగే, అప్రూవర్ దస్తగిరి కూడా విచారణకు వచ్చారు. ఇక జ్యుడిషియల్ రిమాండులో ఉన్న నిందితులను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చారు.

ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్ పేజీలు జిరాక్స్ కాపీలు కావాలని కోరిన నిందితుల తరుఫు న్యాయవాది కోరారు. అయితే, తాము ఇప్పటికే సాఫ్ట్ కాపీలను అందజేశామని కోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు. తమకు సాఫ్ట్ కాపీలు కాకుండా జిరాక్స్ కాపీలు అందజేయాలని నిందితుల తరఫు న్యాయవాది కోరారు.

గతంలో ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. గత న్యాయమూర్తి నిర్ణయం వెల్లడించలేదని తెలిపారు. దీనిపై వారి అభ్యంతరాలను కోర్టుకు బుధవారం చెప్పాలంటూ సీబీఐ న్యాయస్థానం చెప్పింది. ఈ నెల 21కి కేసు వాయిదా పడింది.

Also Read: రేవంత్ రెడ్డికి ఏలేటీ మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ