రేవంత్ రెడ్డికి ఏలేటీ మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ

Alleti Maheshwar Reddy: కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎనిమిది మందే ఎంపీలుగా గెలిచారని..

రేవంత్ రెడ్డికి ఏలేటీ మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ

Alleti Maheshwar Reddy

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై బీజేఎల్పీ లీడర్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని, అవి అమలు కాలేదని చెప్పారు.

సీఎం కుర్చీ కోసమే రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామన్నారని అన్నారు. ఆ హామీ ఏమైందని అడిగారు. అలాగే, మహా లక్ష్మి పథకం కింద రూ.2,500 ఏమయ్యాయని నిలదీశారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.

సన్న వడ్లకే బోనస్ అంటున్నారని, మరి దొడ్ల వడ్లకు ఎప్పుడు ఇస్తారని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అడిగారు. ఆగస్టు 15న చేస్తామని అంటున్నారని చెప్పారు. తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ పార్టీ ఎనిమిది ఎంపీల స్థానాల్లో గెలిచిందని అన్నారు.

కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎనిమిది మందే ఎంపీలుగా గెలిచారని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అని చెప్పిన రేవంత్ రెడ్డి దానికి భాధ్యత వహించాలి కదా అని అన్నారు. హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ఎందుకంటే..