విద్యుత్‌ కోనుగోళ్లపై కేసీఆర్‌కు నోటీసులు.. ఆ రోజున విచారణకు రావాలని..

BRS Chief KCR: ఇప్పటికే థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ కంపెనీలు చేసుకున్న ఒప్పందాలపై

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోళ్లపై జస్టిస్‌ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. విద్యుత్‌ ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై ఆయన వివరణ కోరారు. ఈ నెలలోగా వివరణ ఇవ్వాలని చెప్పారు.

అయితే, అందుకు జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఇప్పటివరకు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామని, అందరూ వివరణ ఇచ్చారని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. ఒకవేళ నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉండకపోతే తమ ముందు మళ్లీ విచారణకు రావాల్సిందేనని అన్నారు.

కాగా, ఇప్పటికే థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ కంపెనీలు చేసుకున్న ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి, అందుకు జస్టిస్ నరసింహారెడ్డిని ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షలు కూడా నిర్వహించారు.

Also Read: ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పా: చంద్రబాబు

ట్రెండింగ్ వార్తలు