ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే..

నల్గొండ, ఖమ్మం, భువనగిరిలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

Cm Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన ఎంపీలతో రేపు (జూన్ 12) భేటీ అవుతున్నారు. విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 8 మంది గెలుపొందారు. నల్గొండ, ఖమ్మం, భువనగిరిలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లు అవుతోంది. ఇంకా అనేక విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. విభజన హామీలు ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణకు రావాల్సిన నిధులు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా.. ఈ అంశాలన్నింటిపై పార్లమెంట్ వేదికగా అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది.

వీటన్నింటితో పాటు కొత్తగా ఎంపికైన ఎంపీలు ఉన్నారు. వారికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి? రాష్ట్రానికి సంబంధించిన ఏయే అంశాలపై పార్లమెంటులో ప్రస్తావించాలి? అనే దానిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎంపీలను ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి.. రేపు ఉదయం తన నివాసంలో వారితో భేటీ కానున్నారు.

Also Read : విద్యుత్‌ కోనుగోళ్లపై కేసీఆర్‌కు నోటీసులు.. ఆ రోజున విచారణకు రావాలని..

 

ట్రెండింగ్ వార్తలు