teenmar mallanna and naveen kumar reddy take oath as MLCs
MLC Teenmar Mallanna Oath: తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, ఇటీవల జరిగిన వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
తనకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, పార్టీ నాయకులకు ధన్యవాదాలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని, పట్టభద్రులకి అండగా ఉంటానని అన్నారు. తీన్మార్ మల్లన్న టీంకి ధన్యవాదాలు చెప్పారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నవీన్ కుమార్ తో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ చేయించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అజేయుడు.. ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: 7 మండలాల విలీనంపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు.. స్పందించిన బీఆర్ఎస్