చంద్రబాబు డైరెక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ఎంపీ బాల్క సుమన్ ఆరోపణలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని తన ఘనతగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు.

Balka Suman on Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం రేవంత్ గాలికి వదిలిశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతోందన్నారు. ఏపీలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆదిత్యనాథ్‌ను తెలంగాణ సాగునీటి శాఖకు సలహాదారుగా నియమించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. టీడీపీ, బీజేపీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏనాడు పాటుపడలేదని విమర్శించారు.

”ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని తన ఘనతగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము ఆనాడే అన్ని వేదికలపైనా వ్యతిరేకించాం. పార్లమెంట్‌లో తీవ్ర నిరసన తెలిపాం. ఈ నిర్ణయంతో లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా ఏపీకి వెళ్లిపోయింది. ఆనాడు టీడీపీలో కీలక పదవిలో ఉన్న ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. దీనిపై ఒక్కసారి కూడా నిరసన తెలపలేదు. తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేసి చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read: ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పా: చంద్రబాబు

టీడీపీ, బీజేపీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏనాడు పాటుపడలేదు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరించాలి. తెలంగాణకు రావాల్సిన వాటాలపై కాంగ్రెస్ ఎంపీలు పోరాడాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంత్రుల పేషీలో కమిషన్ల వసూలు కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. మేము బయటపెట్టిన కుంభకోణాలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ధాన్యం, బియ్యం టెండర్లు రద్దు చేశారా, లేదా అనేది స్పష్టత ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. మిల్లర్లు ధాన్యం తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించడం లేదంటే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంద”ని బాల్క సుమన్ అన్నారు.

Also Read: ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం పట్ల వీహెచ్ కామెంట్స్.. ఆ విషయంలో ఎన్డీయేను ఒప్పించాలని సూచన

ట్రెండింగ్ వార్తలు