హైద‌రాబాద్‌లో వాటి జోలికి వెళ్లకండి..! వెళ్లారో జైలుకే..

గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్ హోళ్లను ప్రజలు గుర్తించేలా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలా ..

Hyderabad Manholes : హైదరాబాద్ లోని రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. ప్రతీరోజూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదువుతూనే ఉంటాయి. ఇక వర్షం కురిసిందంటే కిలో మీటర్ దూరం వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. దీనికితోడు ఎక్కడ మ్యాన్ హోళ్లు ఉంటాయోనన్న ఆందోళన. పలువురు వాహనదారులు మ్యాన్ హోళ్లలో పడి మరణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్ హోళ్లను ప్రజలు గుర్తించేలా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలా వాటికి ఎరుపు రంగును అద్దుతోంది.

Also Read:  ఏపీ ప్రజలు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యమేంటి? నవ్యాంధ్రలో నవశకం తీసుకురాబోతున్నారా?

గ్రేటర్ పరిధిలో మొత్తం 25వేలకుపైగా లోతైన మ్యాన్ హోళ్లు ఉన్నాయి. వీటిపై సేప్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడంతోపాటు, వాటిని ప్రజలు తేలికగా గుర్తించేందుకు ఎరుపు రంగు పూస్తున్నారు. తద్వారా వానా కాలంలో, వర్షాలు పడిన సమయంలో మ్యాన్ హోళ్లలో పడకుండా ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పుడు రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరుతుంది. ఆ నీరు వెళ్లుందుకు కొందరు మ్యాన్ హోళ్లను తెరుస్తుంటారు. తద్వారా వాహనదారులకు ప్రమాదం పొంచిఉంటుంది. అలాంటి పరిస్థితి లేకుండా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. దీనికితోడు మ్యాన్ హోళ్లను ఎవరైనా తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: 6 రోజుల్లో రూ.1100 కోట్లు.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్

జలమండలి చట్టం 1989 సెక్షన్ 74 ప్రకారం అక్రమంగా మ్యాన్ హోళ్లు తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది. దీంతో ఎవరైనా తమ ఇష్టానుసారంగా ఎరుపు రంగువేసిన మ్యాన్ హోల్స్ తెరిస్తే ఇక నుంచి జైలు ఊచలు లెక్కించాల్సిందే. నగర వాసులు ఎరువు రంగు వేసిన మ్యాన్ హోల్స్ జోలికి ఎట్టిపరిస్థితుల్లో వెళ్లకండి. మరోవైపు సీవరేజ్ సమస్యలు ఉంటే ప్రజలు జలమండలి వినియోగదారుల సేవా కేంద్రం 155313కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

 

ట్రెండింగ్ వార్తలు