Ugadi Panchangam Gold Rate : ఈ ఏడాది బంగారం రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా..? ఉగాది పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..
Ugadi Panchangam Gold Rate : బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేసిన కే. సూర్యనారాయణ మూర్తి ఈ ఏడాది బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను వివరించారు.
Ugadi Panchangam Gold Rate
- తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
- పంచాంగ శ్రవణం వినిపించిన సూర్యనారాయణ
- ఈ ఏడాది బంగారం రేట్లు పెరుగుతాయని వెల్లడి
Ugadi Panchangam Gold Rate : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఆలయాల వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి.. ఆలయాల్లో పండితులు చెప్పిన పంచాంగ శ్రవణాలను శ్రద్దగా విన్నారు. అంతేకాక.. పార్టీ కార్యాలయాల్లోనూ పండితులు పంచాంగ శ్రవణాలను వినిపించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేసిన కే. సూర్యనారాయణ మూర్తి ఈ ఏడాది బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను వివరించారు.
ఈ ఏడాది బంగారం రేట్లు మరింత పెరుగుతాయని కె. సూర్య నారాయణమూర్తి చెప్పారు. బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదని అన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి క్రమంగా పెరిగే అవకాశం ఉందని, తద్వారా బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. విద్యారంగంలో అనేక మార్పులు వస్తాయని, జాతీయ విద్య విధానం అమల్లోకి వస్తుందని పండితులు సూర్య నారాయణ మూర్తి తన పంచాంగ శ్రవణంలో వివరించారు.
రక్షణ విషయంలో ఇబ్బందులు లేవు.. ఈ సంవత్సరం అధిక మాసం వస్తుంది. అందువలన ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. ప్రపంచంలో యుద్ధ మేఘాలు అలముకున్న దేశంలో గ్యాస్ రేట్లు భారీగా పెరగలేదు.. భవిష్యత్తులోనూ పెరగవని చెప్పారు. ఆదమర్శి ఉండకూడదని సూచించారు. ఈ ఏడాది కొత్త వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారతీయులంతా బొట్టు పెట్టుకోవాలి.. దీని వలన నెగిటివిటీ పోతుందని సూర్య నారాయణ మూర్తి తెలిపారు.
