Whatsapp Age Restrictions : బిగ్ షాకింగ్ న్యూస్.. వాట్సాప్‌లో ఇక వయసు చెప్పాల్సిందేనా? కొత్త ప్రాంప్ట్‌తో యూజర్లలో టెన్షన్!
Whatsapp Age Restrictions : వాట్సాప్ యూజర్ల కోసం త్వరలో వయస్సు ఆధారిత ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. భారతీయ వాట్సాప్ యూజర్లలో చాలామందికి ఏజ్ వెరిఫికేషన్ చేసుకోవాలంటూ కొత్త ప్రాంప్ట్ కనిపిస్తుందని అంటున్నారు.
WhatsApp Going To Introduce Age Restrictions
- భారతీయ వాట్సాప్ యూజర్లకు కొత్త టెన్షన్
- వాట్సాప్ వాడాలంటే వయస్సు ఎంతో చెప్పాలి?
- ఏజ్ వెరిఫికేషన్ ప్రాంప్ట్ అడుగుతుందంటున్న యూజర్లు
Whatsapp Age Restrictions : భారతీయ వాట్సాప్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. అతి త్వరలో వాట్సాప్ అకౌంట్లు అందరూ వాడలేరా? వయస్సు ఆధారిత ఆంక్షలు అమల్లోకి రానున్నాయా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ తెగ నడుస్తోంది.
వాట్సాప్ యూజర్లు ఇకపై తమ పుట్టిన తేదీతో రిజిస్టర్ చేసుకోవాలని లేదంటే యాక్సస్ చేయలేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ, ఇప్పటికే కొంతమంది వాట్సాప్ యూజర్లకు తమ పుట్టిన తేదీని ఎంటర్ చేయాలని యాప్‌లో ప్రాంప్ట్ కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.
భారత్‌లోనూ ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ :
అయితే, దీనికి సంబంధించి స్క్రీన్‌షాట్‌ను కూడా టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది. దాంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు ఈ విషయంపై వాట్సాప్ గానీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వాట్సాప్‌లో ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయనే వాదనలపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.
Read Also : Jio Recharge Plan : జియో రూ.3,599 ప్లాన్‌తో డబుల్ ధమాకా.. 912GB డేటా, అన్లిమిటెడ్ 5G, జెమిని ప్రో ఫ్రీ!
వాస్తవానికి, కొన్ని సందర్భాల్లో వాట్సాప్ యూజర్లు లాగిన్ అయ్యే సమయంలో ఏజ్ అడగడం కామన్.. ఇది కేవలం చట్టపరమైన నిబంధనలు, వయస్సుకు తగిన ఫీచర్లను అందించడం, సేఫ్టీని మెరుగుపరచడం, సర్వీసులను డెవలప్ చేయడం వంటి కారణాలతో కూడా వయస్సు వివరాలను మెసేజింగ్ యాప్ కలెక్ట్ చేయనున్నట్టు ఇప్పటికే సపోర్ట్ పేజీల్లో కూడా పేర్కొంది. ఈ సమాచారం ఇతర యూజర్లకు కనిపించదని కూడా వాట్సాప్ స్పష్టం చేసింది.
ఇతర దేశాల్లో కొత్త నిబంధనలు :
ఇప్పటికే, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలు మైనర్ల ఆన్లైన్ సేఫ్టీ కోసం కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో, భారత్ కూడా అలాంటి చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకవేళ అలాంటి విధానం అమల్లోకి వస్తే.. వాట్సాప్‌తో పాటు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపైనా దీని ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలే. కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఈ ఏజ్ ప్రాంప్ట్ ఎందుకు అనేది చెప్పలేం..
