చంద్రబాబు నిర్ణయం పట్ల వీహెచ్ కామెంట్స్.. ఆ విషయంలో ఎన్డీయేను ఒప్పించాలని సూచన

చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని వీహెచ్ అన్నారు.

V. Hanumantha Rao : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదిలాఉంటే.. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారని, ఇప్పుడు నాల్గోసారి ముఖ్యమంత్రి కావడం గర్వంగా ఉందని అన్నారు.

Also Read: Ambati Rayudu : సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూడాల‌నేది నా క‌ల‌.. ఇంకో అడుగు దూర‌మే : అంబ‌టి రాయుడు

చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. కులగణన చేయడానికి ఎన్డీయేలో భాగస్వామ్యం ఉన్న నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు చొరవ చూపాలని, ఆమేరకు ఎన్డీయేపై ఒత్తిడి తేవాలని వీహెచ్ కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బడుగు బలహీన వర్గాలకోసం కష్ట పడుతున్నారని వీహెచ్ అన్నారు. ప్రియాంక గాంధీ వయనాడ్ లో పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుస్తుందని వీహెచ్ దీమా వ్యక్తం చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు