Narsingi : నార్సింగిలో దారుణం.. బాలికకు గంజాయి ఇచ్చి.. మత్తులో ఉండగా రేప్ చేసిన రౌడీషీటర్లు
Narsingi : హైదరాబాద్ పరిధిలోని నార్సింగి ప్రాంతంలో ముగ్గురు రౌడీషీట్లు బాలికపై అత్యాచారంకు పాల్పడ్డారు. బాలికకు గంజాయి ఇచ్చి.. ఆమె మత్తులోకి వెళ్లిన తరువాత దారుణానికి ఒడిగట్టారు.
Hyderabad
- హైదరాబాద్ పరిధిలోని నార్సింగిలో దారుణం
- బాలికపై అత్యాచారంకు పాల్పడిన ముగ్గురు రౌడీషీటర్లు
- గంజాయి మత్తు ఇచ్చి ఆమె మత్తులో ఉండగా అత్యాచారం
Narsingi : చిన్నారులపై వరుస హత్యాచార ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఏపీలో అన్నమయ్య జిల్లాలో ఏడేళ్ల బాలికపై హత్యాచారంకు పాల్పడి హత్య చేసిన ఘటన మరువక ముందే.. హైదరాబాద్లోని నార్సింగి ప్రాంతంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికకు గంజాయి ఇచ్చి.. ఆమె మత్తులో ఉండగా ముగ్గురు రౌడీషీట్లు దారుణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ పరిధిలోని నార్సింగి ప్రాంతంలో ముగ్గురు రౌడీషీటర్లు బాలికపై అత్యాచారంకు పాల్పడ్డారు. బాలికకు గంజాయి ఇచ్చి.. ఆమె మత్తులోకి వెళ్లిన తరువాత శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారంకు ఒడిగట్టారు. స్పృహతప్పి పడిపోయిఉన్న బాలికను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై దారుణానికి పాల్పడిన ముగ్గురు రౌడీషీటర్లు పరారీలో ఉండటంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బాలికకు, రౌడీషీటర్లకు ఇంతకుముందు ఏమైనా పరిచయం ఉందా.. లేదంటే బాలికను బలవంతంగా తీసుకొచ్చి గంజాయి మత్తు ఇచ్చి శివారు ప్రాంతాలకు తీసుకెళ్లారా.. ఏం జరిగిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలిక స్పృహలోకి వచ్చిన తరువాత ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
