Sunny Leone : కేరళ విశ్వవిద్యాలయంలో సన్నీలియోన్ డ్యాన్స్.. షాకిచ్చిన వీసీ..!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Published On : June 13, 2024 / 04:22 PM IST
Kerala University Denies Permission For Sunny Leone Dance Event On Campus
Sunny Leone Dance Event : బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు షాక్ తగిలింది. ఓ యూనివర్సిటీలో ఆమె డ్యాన్స్ షోకు అనుమతి నిరాకరించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ క్యాంపస్‌లో జూలై 5న సన్నీలియోన్ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ డ్యాన్స్ షోకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ అనుమతి నిరాకరించారు.
ప్రోగ్రామ్ లిస్ట్‌లో ఆమె డ్యాన్స్ షోను చేర్చొద్దని ఆదేశాలు జారీ చేశారు. క్యాంపస్ లోపల లేదా వెలుపల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి యూనియన్‌ను అనుమతించబోమని ఆయన ఉద్ఘాటించారు. కాగా..ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విశ్వవిద్యాలయ అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందడంలో కళాశాల యూనియన్ కూడా విఫలమైందనట్లు తెలుస్తోంది.
ఆద్య గురించి రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. ఏమందో తెలుసా?
అయితే.. గతేడాది నవంబర్‌లో కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో సంగీత కచేరీ నిర్వహించారు. ఈ కచేరీలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కాలేజీ క్యాంపస్‌లలో ఎక్స్‌టర్నల్ డీజే పార్టీలు, మ్యూజిక్ నైట్‌లు మొదలైన వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో సన్నీ లియోన్ డ్యాన్స్ షోకు వీసీ అనుమతి నిరాకరించినట్లుగా పలు రిపోర్టులు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల సన్నీలియోన్ ‘జిస్మ్ 2’, ‘జాక్‌పాట్’, ‘షూటౌట్ ఎట్ వడాలా’, ‘ రాగిణి ఎంఎంఎస్ 2’ వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించింది . ఆమె ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ముహూర్తం పూజ చేస్తున్న వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా.. ఈ సినిమాకు ఇంకా పేరును ఖరారు చేయలేదు.
Ajay Ghosh : సినిమా బాగోకపోతే ఫోన్ చేసి తిట్టండి.. స్టేజిపై ఫోన్ నంబర్ ఇచ్చిన సీనియర్ నటుడు..
