Ajay Ghosh : సినిమా బాగోకపోతే ఫోన్ చేసి తిట్టండి.. స్టేజిపై ఫోన్ నంబర్ ఇచ్చిన సీనియర్ నటుడు..

తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో అజయ్ ఘోష్ సినిమా గురించి గొప్పగా చెప్పి..

Ajay Ghosh : సినిమా బాగోకపోతే ఫోన్ చేసి తిట్టండి.. స్టేజిపై ఫోన్ నంబర్ ఇచ్చిన సీనియర్ నటుడు..

Ajay Ghosh gives his Number and says Viral Comments in Music Shop Murthy Movie Pre Release Event

Ajay Ghosh : ఇటీవల సినిమా ప్రమోషన్స్ కొత్తకొత్తగా అచేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ కోసం వైరల్ అవ్వడానికి నటీనటులు కూడా కంటెంట్ బాగానే ఇస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ నటుడు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.

ఇప్పటికే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి జూన్ 14న రిలీజ్ కాబోతుంది. ఓ 50 ఏళ్ళ మిడిల్ క్లాస్ వ్యక్తి తన జీవితాశయం డీజే గా మారాలనుకుంటే ఆ క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు, అతనికి ఓ యువతి ఎలా సహాయపడింది అనే కథాంశంతో ఈ సినిమాని మంచి ఎమోషనల్ గా తెరకెక్కించారు.

Also Read : Disha Patani : ‘కల్కి’ నుంచి రాక్సీ వచ్చేసింది.. దిశాపటాని ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..

ఇప్పటికే పలుప్రమోషన్స్ లో అజయ్ ఘోష్ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పి, చాలా బాగుంది కాబట్టే లీడ్ రోల్ చేశాను అని తెలిపారు. తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో అజయ్ ఘోష్ సినిమా గురించి గొప్పగా చెప్పి.. ఈ సినిమా బాగోకపోతే ఫోన్ చేసి మీ ఇష్టమొచ్చినట్టు తిట్టండి అంటూ స్టేజి మీదే తన ఫోన్ నంబర్ చెప్పేసారు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక బిజీగా ఉన్న సీనియర్ నటుడు ఇలా మాట్లాడి ఫోన్ నంబర్ చెప్పడంతో అజయ్ ఘోష్ స్పీచ్ వైరల్ గా మారింది.