సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు చంద్రబాబు.

Chandrababu First Sign : ఏపీ సీఎంగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. సాయంత్రం 4.41 గంటలకు సీఎం చాంబర్ లో బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే.. ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. అటు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అడుగడుగునా రాజధాని రైతుల ఘనస్వాగతం పలికారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై చేశారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన తొలి సంతకం డీఎస్సీ పైనే ఉంటుందని చంద్రబాబు మాటిచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ పైనే తొలి సంతకం చేశారాయన.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టారు. సామాజిక పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్య గణనపై 5వ చేశారు సీఎం చంద్రబాబు.

Also Read : ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు? రేసులో చాలామంది టీడీపీ సీనియర్ నేతలు

ట్రెండింగ్ వార్తలు