Rape Attempt : తల్లితో సమానమైన వదినపై కన్నేసిన మరిది అన్న ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచార యత్నం చేసిన ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సుఖిసేవానియా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 28 ఏళ్ల వివాహితపై ఆమె మరిది శనివారం రాత్రి అత్యాచారం చేశాడు.
వృత్తిరీత్యా ఆటోడ్రైవరైన వివాహిత భర్త శనివారం రాత్రి ఆటో నడపటానికి బయటకు వెళ్లాడు. ఎప్పటి నుంచో వదినపై కన్నసిన అతని తమ్ముడు…అన్న ఇంట్లో లేని సమయం తెలుసుకున్నాడు. శనివారం రాత్రి అన్నను కలవటానికి ఇంటికి వచ్చాడు.
Also Read : Molestation : వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్మెయిల్
మీ అన్నయ్య ఇంట్లో లేరు. ఆటో కిరాయిలకోసం వెళ్లారు. రేపు ఉదయం వస్తారని వదిన చెప్పింది. రేపు ఉదయం అన్నను కలిసి మాట్లాడి వెళతానని మరిది చెప్పటంతో సరే అంది ఆ మహిళ.
రాత్రి తన గదిలోకి వెళ్లి నిద్రిస్తున్న మహిళపై ఆమె మరిది ప్రవేశించి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె గట్టిగా అరవటంతో అతను అక్కడినుంచి బయటకు పారిపోయాడు. ఆదివారం ఉదయం మహిళ తన మరిదిఫై సుఖి సేవానియా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.