Pakistan : దైవ దూషణ చేశాడని పాకిస్తాన్ లో యువకుడికి మరణ శిక్ష

బహవల్ పూర్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధించింది.

Young Man Death Penalty : దైవ దూషణ చేశాడని పాకిస్తాన్ (Pakistan)లో ఓ వ్యక్తికి మరణ శిక్ష(Death Penalty) పడింది. దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు, దైవ దూషణ చేశాడనే ఆరోపణలపై ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్తాన్ కోర్టు శుక్రవారం మరణ శిక్ష విధించింది.

లాహోర్ (Lahore)కు 400 కిలో మీటర్ల దూరంలోని బహవల్ పూర్ (Bahawalpur)లో ఇస్లామ్ కాలనీకి చెందిన 19 ఏళ్ల నౌమాన్ మసేహ దైవాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేశాడని, అతనిపై కేసు నమోదు చేసిన అధికారులు వాట్సాప్ ద్వారా అతడు పంపిన మెస్సేజ్ లను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టారు.

Gurrapu Shailesh : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం

బహవల్ పూర్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు