IPL 2024 : ఐపీఎల్ ముగింపు వేడుక‌లు.. ప్రఖ్యాత అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ క‌చేరీ..

మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు నేటితో తెర‌ప‌డ‌నుంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుక‌ల్లో ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ ప్రత్యేక కచేరీని ప్రదర్శిస్తుంది.

కాగా.. సాయంత్రం 6 గంట‌ల‌కు ముగింపు వేడుక‌లు ప్రారంభం కానున్నాయి. ఈ విష‌యాన్ని ఐపీఎల్ ప్రసార‌క‌ర్త స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. బ్యాండ్ ప్రధాన గాయకుడు డాన్ రేనాల్డ్స్ వీడియోను సోషల్ పంచుకున్నారు.

Pat Cummins : ఐపీఎల్ ఫైన‌ల్‌కు ముందు.. ధోనీ సిక్స్‌ను క‌న్నార్ప‌కుండా చూస్తున్న క‌మిన్స్‌..

విరాట కోహ్లీతో ప్రారంభం అయ్యే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగింపు వేడుల్లో మ్యూజిక్‌తో పాటు లేజ‌ర్ షో ఉండ‌నుంది. మ‌రికొన్ని ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఏర్పాటు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. అర‌గంట ముందు అంటే రాత్రి 7.00 గంట‌ల‌కు టాస్ వేయ‌నున్నారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇరు జ‌ట్లు ముఖాముఖిగా 27 సంద‌ర్భాల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో కోల్‌క‌తా 18 సార్లు విజ‌యం సాధించ‌గా, హైద‌రాబాద్ 9 సార్లు గెలుపొందింది. ఈ సీజ‌న్‌లో రెండు సార్లు త‌ల‌ప‌డ‌గా రెండు మ్యాచుల్లోనూ కోల్‌క‌తానే గెలుపొందడం గ‌మ‌నార్హం.

Babar Azam : బాబ‌ర్ ఆజాం నుంచి కోహ్లికి ముప్పు.. రోహిత్ శ‌ర్మను వెన‌క్కి నెట్టేశాడు..

ట్రెండింగ్ వార్తలు