CRPF Recruitment : సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ లో భారీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే దరఖాస్తు చేసే అభ్యర్ధులు కనీసం పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ అయుండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

CRPF Recruitment : సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్లో భారీగా ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. సీఆర్ పీఎఫ్ లో దాదాపు 1,29,929 వేల కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో 1,25,262 పురుష అభ్యర్థులకు, 4667 మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ సమస్య గురించి కళ్ళు, కాళ్ళు, నాలుకలో కనిపించే 5 సంకేతాలు !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే దరఖాస్తు చేసే అభ్యర్ధులు కనీసం పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ అయుండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. OBC కేటగిరీల విద్యార్థులకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్ట్‌కి రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం ఖాళీలను ఎక్స్-అగ్నివీర్లకు రిజర్వ్ చేశారు.

READ ALSO : Workout Injuries : జిమ్ గాయాలు ఫిట్‌నెస్ లక్ష్యాలకు అంతరాయం కలిగిస్తే? వాటిని ఎలా నయం చేసుకోవాలంటే..

అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల జీతం ప్రతి నెలా రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; crpf.gov.in.సందర్శించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు