షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినొచ్చా?

ఈ వేసవిలో అందరి చూపు పుచ్చకాయలపైనే ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. పైగా టేస్టీగా ఉంటుంది. దీంతో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వాటర్ మిలన్ ను తింటారు. మరి పుచ్చకాయ చాలా తియ్యగా ఉంటుంది కదా, షుగర్ పేషెంట్లు వాటిని తినొచ్చా? లేదా ? అనే సందేహం చాలామందిలో ఉంది.

can diabetes patients eat watermelon: ఎండా కాలం వచ్చేసింది. అప్పుడే సూర్యుడు మండిపోతున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. సుర్రుమనే ఎండతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు దాహంతో గొంతులు ఎండిపోతున్నాయి. ఎంత నీరు తాగినా దాహం తీరడం లేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం, దాహం తీర్చుకోవడానికి జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఈ వేసవిలో అందరి చూపు పుచ్చకాయలపైనే ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. పైగా టేస్టీగా ఉంటుంది. దీంతో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వాటర్ మిలన్ ను తింటారు. మరి పుచ్చకాయ చాలా తియ్యగా ఉంటుంది కదా, షుగర్ పేషెంట్లు వాటిని తినొచ్చా? లేదా ? అనే సందేహం చాలామందిలో ఉంది.

పుచ్చకాయ కూల్ డ్రింక్ తో సమానమే, కానీ:
దీని విషయంలో మరీ భయపడాల్సిన పనేమీ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయా పదార్థాల్లోని గ్లూకోజు రక్తంలో ఎంత వేగంగా కలుస్తోందనే దాన్ని ఒక సంఖ్యతో సూచిస్తారు. దీన్ని గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) అంటారు. ఇది అధికంగా ఉండే పదార్థాల విషయంలో మధుమేహులు జాగ్రత్తగా ఉండటం మంచిదే. పుచ్చకాయ జీఐ 72. నిజానికిది దాదాపు కూల్‌డ్రింక్ తో సమానమే అయినప్పటికీ పుచ్చకాయలో పిండి పదార్థం చాలా తక్కువ.

100 గ్రాముల పుచ్చకాయ తిన్నా ఒక బ్రెడ్డు ముక్కతో సమానం:
సుమారు 100 గ్రాముల పుచ్చకాయ ముక్కల్లో ఉండే పిండి పదార్థం 7 గ్రాములే. అంటే 100 గ్రాములు తిన్నా కూడా ఒక బ్రెడ్డు ముక్కతో సమానం కాదన్నమాట. పైగా ఇందులో నీటి శాతం ఎక్కువ. అందువల్ల పుచ్చకాయను తిన్నప్పుడు వెంటనే గ్లూకోజు పెరుగుతుండొచ్చు గానీ మరీ ఎక్కువసేపు అలాగే ఉండదు. త్వరగానే తగ్గుతుంది. అంటే తాత్కాలికంగానే గ్లూకోజు స్థాయులు పెరుగుతాయన్నమాట.

పుష్కలంగా పోషకాలు, విటమిన్లు:
పుచ్చకాయలో ఒక్క పిండి పదార్థమే కాదు.. విటమిన్‌ ఎ, విటమిన్‌ బి1, బి6, విటమిన్‌ సి, పొటాషియం, మెగ్నీషియం, పీచు, ఐరన్‌, క్యాల్షియం, లైకోపేన్‌ వంటి పోషకాలూ ఉంటాయి. విటమిన్‌ ఎ గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. విటమిన్‌ సి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ జబ్బులు, ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది.

కిడ్నీలకు మంచిది:
పుచ్చకాయ గుజ్జుకు ఎర్రటి రంగునిచ్చే లైకోపేన్‌ సైతం యాంటీ ఆక్సిడెంటే. ఇక దీనిలోని పీచు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. మెగ్నీషియం, పొటాషియం రక్త ప్రసరణ మెరుగుపడేలా, కిడ్నీలు సరిగా పనిచేసేలా చేస్తాయి. అంతేకాదు, దీనిలోని సిట్రులిన్‌ అనే అమైనో ఆమ్లం రక్తపోటు తగ్గటానికి, జీవక్రియలు చురుగా సాగటానికి తోడ్పడుతుంది. ఇవన్నీ మధుమేహులకు మేలు చేసేవే. ఒక్క గ్లూకోజు భయంతో పుచ్చకాయ తినటం మానేస్తే ఇలాంటి ప్రయోజనాలన్నీ కోల్పోయినట్టే అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు