Afghan Sikhs – Modi: అఫ్గాన్​ సిక్కు- హిందూ ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ

తాలిబన్ కబంద హస్తాల్లో చిక్కుకున్న అఫ్గాన్​ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్​కు తీసుకురావటంపై.. అఫ్గాన్ సిక్కు ప్రముఖులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Afghan Sikhs – Modi: తాలిబన్ కబంద హస్తాల్లో చిక్కుకున్న అఫ్గాన్​ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్​కు తీసుకురావటంపై.. అఫ్గాన్ సిక్కు ప్రముఖులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తాలిబన్ ల దండయాత్ర సమయంలో అఫ్గానిస్తాన్ నుంచి భారత్ వచ్చిన హిందు..సిక్కు ప్రతినిధుల బృందం.. శనివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని 7వ లోక్​ కల్యాణ్​ మార్గ్​లోఉన్న ప్రధాని నివాసంలో..మోదీ వారితో భేటీ అయ్యారు. సిక్కు- హిందూ ప్రతినిధుల బృందం ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా భారత్ లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలను సిక్కు ప్రతినిధులకు వివరించారు ప్రధాని మోదీ.

Also read: India – UAE: మనకు బంగారు కడ్డీలు, వారికి ఆభరణాలు: దుబాయ్ – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం 

గత ఏడాది అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​కు వచ్చిన నిదాన్​ సింగ్​ సచ్​దేవ్ అనే వ్యక్తి ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అఫ్గాన్ లో గురుద్వారలో ఉన్న తమను తాలిబన్లు కిడ్నప్ చేశారని, భారత గూఢచారిగా భావించిన తాలిబన్లు, మత మార్పిడి కోసం తమపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు.. ఏఎన్ఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిదాన్​ సింగ్​ సచ్​దేవ్ వివరించారు. మమ్మల్ని రక్షించిన ప్రధాని మోదికి కృతజ్ఞతలు..భారత్ చేసిన సహాయంతో సంతోషంగా ఉన్నామని నిదాన్​ సింగ్​ సచ్​దేవ్ పేర్కొన్నారు. ఇక ఇక్కడ బ్రతికేందుకు..పౌరసత్వం, నివాస యోగ్యం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

Also read: Stormy Cheers: నార్త్‌ కొరియా కిమ్ శాడిజం.. మైనస్‌ 15 డిగ్రీల ఉష్టోగ్రతలో!

అఫ్గాన్​ సిక్కు ప్రతినిధులతో ప్రధాని మోదీ మాట్లాడుతూ గురు గ్రాంత్​ సాహిబ్​ను గౌరవించుకునే సంప్రదాయం ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు. అఫ్గాన్​ నుంచి గురు గ్రాంత్​ సాహిబ్​ స్వరూప్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రధాని తెలిపారు. అఫ్గాన్లు తమ పట్ల చూపిస్తున్న ప్రేమను, తాను కాబుల్​ వెళ్లిన సందర్భాన్ని ప్రధాని మోదీ వారితో కలిసి గుర్తు చేసుకున్నారు. సిక్కు సమాజానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

Also read: Saudi Arabia Women Jobs: సౌదీలో బుల్లెట్‌ ట్రైన్స్‌ నడపడానికి 30 వేలమంది మహిళలు దరఖాస్తు..అభ్యుదయం దిశగా అతివల అడుగులు..

ట్రెండింగ్ వార్తలు